Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు టెక్ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గతేడాది నవంబర్ నుంచి మొదలైన ఉద్యోగుల తొలగింపు పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజాగా అమెజాన్ సంస్థ తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మూడో త్రైమాసికంలో సానుకూల ఫలితాలు వచ్చినప్పటికీ తొలగింపుల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇ కామర్స్ దిగ్గజం మూడో త్రైమాసికంలో నికర ఆదాయం విశ్లేషకుల అంచనాలను మించి గణనీయమైన మార్జిన్ దాటినప్పటికీ ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. గతేడాది పొడవునా.. 27,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్ లోని తన ఉద్యోగులకు టర్మినేషన్ నోటీసులు అందాయని పేర్కొంట బుధవారం కంపెనీ ధృవీకరించింది.
Read Also: Jay Kotak: మాజీ మిస్ ఇండియాను పెళ్లాడిన బిలియనీర్..
అయితే ఎంత మంది తాజా తొలగింపుల్లో ప్రభావితమవుతున్నారనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. సంస్థాగత అవసరాలు పున:పరిశీలనలో భాగంగా కస్టమర్ల సంతృప్తి, దీర్ఘకాలిక వ్యాపార అవసరాల ప్రాధాన్యత కారణంగా తాజా తొలగింపులు జరుగుతున్నట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ మ్యూజిక్ లోని కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. అమెజాన్ మ్యూజిక్ లో పెట్టుబడులు కొనసాగిస్తామని అతను చెప్పారు. అమెజాన్ మ్యూజిక్, స్పార్టిఫై, పండోరా, ఆపిల్ వంటి స్ట్రీమింగ్ సంస్థలతో పోటీ పడుతోంది. గతేడాది కాలం నుంచి ప్రముఖ టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటివి తమ ఉద్యోగుల్ని తొలగించాయి.