Smartwatch Saves Life: టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరోవైపు సక్రమంగా వినియోగించకుంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అయితే టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్మార్ట్‌వాచ్ కాపాడిన ఘటన యూకేలో జరిగింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ భీకరంగా సాగుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం గాజాను చుట్టుముట్టింది. భూతల దాడులు చేస్తోంది. ఉత్తరగాజాను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమైంది. దీంతో పాటు హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌తో పాటు హమాస్‌ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడులను ముమ్మరం చేసింది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని దారుణంగా చంపేశారు. 200 మందిని బందీలుగా పట్టుకున్నారు.
PM Modi: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సత్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే దానితో పాటు విధ్వంసాన్ని తెస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్‌కి రోడ్‌మ్యాప్ లేదని, మోడీ హామీలపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
Bihar: సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ కీలక రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్‌లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలోని ఇతర వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను పెంచే బిల్లుకు మంగళవారం బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.
CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న నితీష్ కుమార్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదిక తయారైంది. ఇందులో ఆమెపై ‘కఠిన శిక్ష’ విధించాలని సూచించిందని, ఆమెను లోక్‌సభ నుంచి తక్షణమే బహిష్కరించాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
School Teacher: అమెరికాలో దారుణం జరిగింది. మైనర్ విద్యార్థిపై ఓ మహిళా ఉపాధ్యాయురాలు లైంగిక వేధింపులకు పాల్పడింది. మోంట్గోమెరి కౌంటీ పోలీసుల ప్రకారం.. 2015లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడితో 22 ఏళ్ల మెలిస్సా మేరి కర్టిస్ అనే ఉపాధ్యాయురాలు లైంగిక చర్యలు జరిపింది. ప్రస్తుతం ఈమె వయసు 31 ఏళ్లు. ఈ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Earthquake: వరసగా భారీ భూకంపాలతో ద్వీపదేశం ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి శక్తివంతమైన భూకంపం వచ్చింది. 6.7 తీవ్రతతో బండా సముద్రంలో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టాల గురించిన వివరాలు తెలియలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
Himanta Biswa Sarma: మరోసారి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హిమంత, రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఔరంగజేబు, బాబార్లకు వేసినట్లే అని ఆయన అన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేస్తే దానిపై రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని, అయితే అతను ‘ఇండియా హమాస్’ భయపడుతున్నాడని, కానీ ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఉగ్రదాడిని ఖండించారని ఆయన…
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నిన్న ఏయిర్ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై హర్యానా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేతను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే అని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దీంతో పాటే ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబులపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది.