Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న వేళ జెరూసలెంలో విద్వేష ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల యువకుడు 20 ఏళ్ల మహిళా పోలీస్ అధికారిని కత్తితో పొడిచి చంపారడు. జెరూసలేంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఇజ్రాయిల్-అమెరికన్ సార్జెంట్ ఎలిషేవా రోజ్ ఇడా లుబిన్పై దాడి జరిగింది. ఘటనా సమయంలో లుబిన్ మరో ఇద్దరు అధికారులతో కలిసి జెరూసలేంలోని ఓల్డ్ సిటీలో పెట్రోలింగ్ చేస్తోంది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన లుబిన్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఏం చేసినా రిచ్‌గానే ఉంటుంది. ముంబైలోని అంబానీ నివాసం ‘ ఆంటిలియా’ ప్రపంచంలోనే ఖరీదైన నివాసాల్లో ఒకటిగా ఉంది. ఇక కార్ల విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లు అంబానీ కలెక్షన్లో ఉన్నాయి. రోల్స్ రాయిస్, బెంజ్, BMW, ఫెరారీ, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తంగా 150 కన్నా ఎక్కువ కార్లే ముకేష్ అంబానీ గ్యారేజ్ లో ఉంటాయి. వీటితో పాటు రెండు బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఉన్నాయి.
South Korea: మనుషుల పనులను, జీవనశైలిని మరింత సులభతరం చేసేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అయితే టెక్నాలజీ అనేది భవిష్యత్ తరాల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని పలువురు టెక్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇది భవిష్యత్ తరాల్లో మానవ మనుగడకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఇది మానవులకు మరింత సాయంగా ఉంటుందని చెబుతున్నారు.
ISIS: సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడుల్లో 30 మంది ప్రభుత్వ అనుకూల సైనికులు మరణించారు. ఈ ఏడాది జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటి. ‘‘బుధవారం సిరియాలోని చెక్ పోస్టులు, సైనిక స్థావరాలపై ఐసిస్ ఉగ్రవాదులు ఏకకాలంలో జరిపిన దాడుల్లో 30 మంది మరణించారు. వీరిలో నలుగురు సైనికులు ఉండగా.. 26 మంది నేషనల్ డిఫెన్స్ ఫోర్సుకు చెందిన వ్యక్తులు ఉన్నారు’’ అని బ్రిటన్ లోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమర్ రైట్స్ తెలిపింది.
Parliament's Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, క్రిస్మస్కి ఒక రోజు ముందు ఈ సమావేశాలు ముగియవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు తర్వాత కొన్ని రోజులకు పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.
Sri lanka: ఇండియా మిత్రదేశం శ్రీ లంకలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుక భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్న చైనా అక్కడి నుంచి భారత్‌తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్‌లో నిఘా పెంచుతోంది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాతో జట్టు కట్టింది.
Isreal-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విభజన తీసుకువచ్చింది. కొన్ని దేశాలు ఇజ్రాయిల్‌కి మద్దతు తెలుపుతుండగా.. మరికొన్ని దేశాలు పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లకు మద్దతు ఇస్తున్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయిల్‌కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇదిలా ఉంటే యూఎస్ ప్రతినిధుల సభలో పార్టీల మధ్య ఈ అంశం చీలిక తీసుకువచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ఏకైక పాలస్తీనియన్- అమెరికన్ అయిన రషీదా త్లైబ్ చేసిన వ్యాఖ్యలపై సభ సెన్సార్ విధించింది. ఆమె వ్యాఖ్యల్ని సభ ఖండించింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడిని…
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. ఇదిలా ఉంటే మహువా మోయిత్రాపై సీబీఐ విచారణ చేయాలని యాంటీ-కరప్షన్ ప్యానెల్ ఆదేశించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడు ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. భార్య మరణించగా.. నిందితుడైన భరత్ పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య ఉన్నాడు. విషాదం ఏంటంటే వీరిద్దరికి 11 రోజుల క్రితమే బాబు జన్మించాడు.
PM Modi: జనాభా నియంత్రణ గురించి బీహార్ అసెంబ్లీలో నిన్న సీఎం నితీష్ కుమార్ మాట్లాడటం వివాదాస్పదం అయ్యాయి. మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా నితీష్ వ్యవహరించడంపై పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని ఈ రోజు సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.