Jay Kotak: ప్రముఖ బిలియనీర్ ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ మాజీ మిస్ ఇండియా అదితి ఆర్యను వివాహం చేసుకున్నాడు. మంగళవారం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో అదితి ఆర్య యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్న సమయంలో జై ఆమెను అభినందిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా కాబోయే భార్య అదితి ఈ రోజు యేల్ యూనివర్సిటీలో తన ఎంబీఏ పూర్తి చేసింది. మీ గురించి చాలా గర్వంగా ఉంది’’ అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆ సమయంలో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు ధృవీకరించారు.
ఈ హైప్రొఫైల్ మ్యారేజ్‌కి సంబంధించి పెద్దగా ఫోటోలు, వీడియోలు రాలేదు, కానీ రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లలో వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జై కొటర్ షేర్వాణీ ధరించగా.. ఆర్య రెడ్ కలర్ లెహెంగాతో కనిపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీలు ఈ వివాహ కార్యక్రమానికి హాజరైన అతిథుల్లో ఉన్నారు.

Read Also: Mahua Moitra: పార్లమెంట్ నుంచి మహువా మోయిత్రా బహిష్కరణ.. 6:4 తీర్పుతో ప్యానెల్ ఆమోదం..
జై కోటక్ కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్యాడ్యుయేట్ పూర్తి చేశారు. హిస్టరీ, ఎకనామిక్స్ లో పట్టా పొందారు. హార్వర్డ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం కోటక్ మహీంద్ర బ్యాంక్ డిజిటల్ ఫస్ట్ మొబైల్ బ్యాంక్ కోటక్811 వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
అదితి ఆర్య ఢిల్లీ యూనివర్సిటీలోని షయీద్ సుఖ్‌దేవ్ కాలేజీ నుంచి గ్రాడ్యయేషన్ పూర్తి చేసింది. ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో కొంతకాలం రీసెర్చ్ అనలిస్ట్ గా పనిచేశారు. 2015లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించారు. అదితి ఆర్య, రణ్‌వీర్ సింగ్ నటించిన ‘83’తో సహా కొన్ని హిందీ, తెలుగు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఎంబీఏ చేసేందుకు యూఎస్ వెళ్లారు. ఈ ఏడాది మేలో ఎంబీఏలో పట్టా పొందారు.