Israel-Hamas War: శ్మశానాలు నిండిపోయాయి.. ఫుట్‌బాల్ మైదానంలో మృతుల ఖననం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి అక్కడి ప్రజల్ని క్రూరంగా ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 200 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు గాజాలోకి పట్టుకెళ్లారు. హమాస్ చేసిన పని ప్రస్తుతం గాజాలోని పాలస్తీనియన్ల పాలిట నరకంగా మారింది. ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై జరిపిన దాడిలో 10,500 మందికి పైగా మరణించారు.
ముఖ్యంగా గాజా నగరంతో పాటు ఉత్తర గాజాలోని చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయిల్ ప్రస్తుతం భూతల దాడులను కూడా నిర్వహిస్తోంది. గాజాలో తాగునీరు, వైద్యం, ఆహారం, కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. ఇదిలా ఉంటే లెక్కకు మించి ప్రజలు చనిపోతుండటంతో మృతదేహాలను పాలిపెట్టేందుకు కనీసం చోటు కూడా లభించడం లేదు.
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
చాలా ప్రాంతాల్లో శ్మశానాలు నిండిపోయాయి. దీంతో ప్రజలు వారి తోటల్లో చనిపోయిన పిల్లల్ని పాతిపెడుతున్నారు. మహమూద్ అల్ మస్రీ అనే వ్యక్తి తన ముగ్గురు సోదరులను, వారి ఐదుగురు పిల్లల్ని సమీపంలోని సిట్రస్ తోటలో పాతిపెట్టారు. శ్మశాన వాటిక సరిహద్దు జోన్ లో ఉండటంతో పండ్ల తోటలో పాతిపెట్టాల్సి వచ్చిందని మస్రీ వెల్లడించారు.
Read Also: Bigg Boss Telugu 7: అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియదు.. ఏడిపించేసిన యావర్ బ్రదర్స్
ఇప్పటికీ చాలా మృతదేహాలను ఆస్పత్రుల వెలుపల, రోడ్లపై, పార్కుల్లో, ఐస్ క్రీములను తీసుకెళ్లే ట్రక్కుల్లో ఉంచుతున్నారు. ఇవి చాలకపోవడంతో గాజాలోని ఫుట్‌బాల్ మైదానంలో సామూహికంగా ఖననం చేయాల్సి వస్తోంది. కార్లలో నింపుకునేందుకు ఇంధనం లేకపోవడంతో గాడిద బండ్లలో మృతదేహాలను తీసుకెళ్లే దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే ఇజ్రాయిల్ ఉత్తర గాజాను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు సూచించింది. లేకపోతే హమాస్ మిలిటెంట్లు ప్రజల్ని రక్షణ కవచాలుగా వాడుకునే అవకాశం ఉందని తెలిపింది. దీంతో లక్షల్లో ప్రజలు గాజా దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లారు. యుద్ధం పాలస్తీనా ప్రజలకు మానవతా సంక్షోభాన్ని మిగుల్చుతోంది. 50,000 మంది కేవలం 4 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!