Congress: సీనియర్ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం, సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు రాముడి, హిందువులను ద్వేషిస్తున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని ద్వేషించే వ్యక్తి హిందువు కాలేడని, రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉండటం అంటే నిజం చెప్పలేనని అర్థం కాదని ఆయన అన్నారు.
IIT Bombay: ఐఐటీ - బాంబే మరోసారి వార్తల్లో నిలిచింది. గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన ఓ ప్రొఫెసర్ పాలస్తీనా ఉగ్రవాదులను కీర్తించడం వివాదాస్పదం అయింది. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న జరిగిన దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Chicha Ka Australia Tour: రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. నాటునాటు సాంగ్‌తో ఏకంగా ఆస్కార్ అవార్డ్ విజేతగా నిలిచి భారత సినీలోకానికి పరిచయమయ్యారు. ఆయన ఆస్ట్రేలియాలో భారీ లైవ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓల్డ్ మాంక్ ఎంటర్టైన్మెంట్స్, హ్యాష్‌ట్యాగ్ ఇండియా మ్యాగజైన్ మరియు వాసవి గ్రూప్ సహకారంతో రాహుల్ సిప్లిగంజ్ ఆస్ట్రేలియాలో తన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రత్యక్ష ప్రదర్శనను ఈ నవంబర్ 25న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని టింబర్ యార్డ్‌లో ఇవ్వనున్నారు.
Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నాశనం చేసేదాకా ఇజ్రాయిల్ నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది హమాస్. ఆ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీ పౌరులను ఊచకోత కోసింది. 200 మందిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) నిప్పుల వర్షం కురిపిస్తోంది. భూతల దాడులతో విరుచుకుపడుతోంది.
Pakistan: గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రాజకీయ సంక్షోభం కూడా ఆ దేశాన్ని కుదిపేస్తోంది. చివరకు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే.. చివరకు పాస్‌పోర్టులు కూడా ప్రింట్ చేసుకోలేని దుస్థితికి చేరుకుంది. దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Google: వచ్చే నెలలో గూగుల్ తన Gmail అకౌంట్లను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. మిలియన్ సంఖ్యలో Gmail అకౌంట్లు డీయాక్టివేట్ కాబోతున్నాయి. రెండేళ్లుగా తమ అకౌంట్లను వాడకుంటే వాటిని డీయాక్టివ్ చేసే ప్రమాదం ఉంది. మే నెలలో గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ రాసిన బ్లాగులో.. రిస్క్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గూగుల్ ఖాతాల కోసం మా ఇన్‌యాక్టివిటీ విధానాన్ని 2 ఏళ్లకు అప్డేట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Sowa Fish: పాకిస్తాన్‌కి చెందిన ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని వలలో చిక్కిన ఓ చేప అతని తలరాతనే మార్చేసింది. కరాచీ నగరంలోని నిరుపేద మత్స్యకారుడైన హాజీ బలోచ్ అత్యంత అరుదైన చేప చిక్కింది. ఇది కోట్లలో రేటు పలకడంతో అతని దశ తిరిగింది.
Javed Akhtar: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ హిందువులపై ప్రశంసలు కురిపించారు. హిందూ సమాజం సహనంతో ఉందని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల కారణంగా భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందని ఆయన గురువారం అన్నారు. సమాజంలో అసహనం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల భారత్‌ను బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 19న ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ఎవరూ ప్రయాణించొద్దని, ప్రయాణిస్తే ప్రాణాలకు భద్రత ఉండదని, ప్రపంచవ్యాప్తంగా ఆ విమానాలను ఎక్కడా అనుమతించబోమని హెచ్చరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం మూతపడుతుందని, దాని పేరు మారుస్తామని హెచ్చరించారు.
Supreme Court: పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. విచారణ సందర్భంగా, 'మీరు నిప్పుతో ఆడుతున్నారు' అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.