సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తన ప్రచార దూకుడును పెంచింది. నవంబర్ 17న పోలింగ్ జరగనుంది, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.
Russia: ప్రియురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపిన వ్యక్తికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్లాడిస్లావ్ కన్యస్ తన ప్రియురాలు వెరా పెఖ్తెలేవాను 111 సార్లు కత్తితో పొడిచి, పొడిచి హత్య చేశాడు. బ్రేకప్ చెప్పిందనే కోపంతో అత్యాచారానికి పాల్పడి, మూడున్నర గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. చివరకు ఆమె గొంతు కోసేసి చంపేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు.
Earthquake: ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. శనివారం ఢిల్లీలో 2.6 తీవ్రతతో మధ్యామ్నం 3.36 గంటలకు భూకంపం సంభవించింది. నార్త్ డిస్ట్రిక్ట్ లో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదు.
Rashmika Mandanna: నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. జరా పటేల్ అనే ఒక బ్రిటిష్-ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్ నల్లటి దుస్తులు ధరించి లిఫ్టులోకి ప్రవేశించే వీడియోలో డీప్‌ఫేక్ వీడియోలో రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోపై చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో సహా చిత్ర పరిశ్రమ రష్మికకు మద్దతుగా నిలిచారు.
ISIS: దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసిన ఏడుగురు అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరూ వారి హ్యాండర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐసిస్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిధులను సేకరించినట్లు దర్యాప్తులో తేలిందని చార్జిషీట్ పేర్కొంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అక్టోబర్ 7నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై భీకరదాడులు చేస్తోంది. హమాస్‌ని సమూలంగా నాశనం చేసేదాకా విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. హమాస్ ఇజ్రాయిల్‌పై జరిపిన దాడుల్లో 1400 మంది చనిపోయారు, ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ గాజాపై దాడి చేస్తోంది. ఈ దాడుల వల్ల సామాన్య పాలస్తీనియన్లు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఇప్పటికే 11000 మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు.
Uniform civil code: యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) బిల్లును తీసుకువచ్చేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే వారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ వార్తల్లో నిలిచింది. దీనిపై ఏర్పాటు చేసిన జస్టిస్(రిటైర్డ్) రంజనా దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి నివేదిక సమర్పించనుంది.
India-USA: భారత్, అమెరికా మధ్య ఈ రోజు ఇరు దేశాల 2+2 మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడేలా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.
Delhi High Court: మైనర్‌పై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ముగించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అత్యాచార బాధితురాలు, నిందితుడి మధ్య వివాహం ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి కారణం కాదని, అతనిపై వచ్చిన అభియోగాలు తీవ్రమైన స్వభావం కలిగినవని హైకోర్టు పేర్కొంది. ఇరు పక్షాల మధ్య కుదిరిన సెటిల్మెంట్ ఆధారంగా అత్యాచార నేరాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ప్రస్తావించారు.
Gambling: సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.