Anil Ravipudi: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ వేసి సందడి చేశారు. అనంతరం ఆయన తను సినిమాల్లో ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
READ ALSO: Team India Performance 2025: మరో సువర్ణాధ్యాయం.. ఈ ఏడాది టీమిండియా ప్రదర్శన ఇలా!
ఈ సాంగ్ ఈవెంట్‌లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడిని.. హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని యాంకర్ అడగ్గా.. ఆయన దానికి స్పందిస్తూ… ‘అందరూ గుర్తు పెట్టుకోండి.. మనం సక్సెస్ ఫుల్‌గా ఒక దాంట్లో వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. పొరపాటున కూడా అటు వైపు వెళ్తే ఇక మన పని అయిపోయినట్లే.. హ్యాపీగా మనకు వచ్చింది చేసుకుంటూ వెళ్లిపోవాలి, ఇప్పుడప్పుడే హీరోగా చేయాలనే ఆలోచన లేదు’ అని అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా, హీరో విక్టరీ వెంకటేష్ కీ రూల్‌లో కనిపించనున్నారు.
READ ALSO: Director Maruthi: డైరెక్టర్ మారుతి ఇంటికి బిర్యానీ పంపిన డార్లింగ్ ఫ్యాన్స్!