Google: వచ్చే నెలలో గూగుల్ తన Gmail అకౌంట్లను తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. మిలియన్ సంఖ్యలో Gmail అకౌంట్లు డీయాక్టివేట్ కాబోతున్నాయి. రెండేళ్లుగా తమ అకౌంట్లను వాడకుంటే వాటిని డీయాక్టివ్ చేసే ప్రమాదం ఉంది. మే నెలలో గూగుల్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ రాసిన బ్లాగులో.. రిస్క్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గూగుల్ ఖాతాల కోసం మా ఇన్‌యాక్టివిటీ విధానాన్ని 2 ఏళ్లకు అప్‌డేట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఏదైనా Gmail అకౌంట్ రెండేళ్ల నుంచి సైన్ ఇన్ చేయకుంటే.. డిసెంబర్ నుంచి వాటిని గూగుల్ తొలగిస్తుంది. గూగుల్ వర్క్‌స్పేస్( జి మెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్)లతో సహా గూగుల్ ఫోటోస్ లోని కంటెంట్‌తో సహా అకౌంట్, దానిలోని కంటెంట్‌ని తొలగించవచ్చు. చాలా కాలంగా వాడని, మరిచిపోయిన ఖాతాల వల్ల భద్రతా సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని గూగుల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ యాక్టీవ్‌గా ఉన్న గూగుల్ అకౌంట్లను తొలగిస్తోంది.
Read Also: Sowa Fish: “ఇది చేప కాదు, బంగారం”.. ఒకే రాత్రిలో కోటీశ్వరుడైన పాక్ మత్స్యకారుడు..
ఎవరి అకౌంట్లు రిస్కులో ఉంటాయి..?
రెండేళ్లుగా ఓపెన్ చేయని వ్యక్తిగత గూగుల్ అకౌంట్లు మాత్రమే ఇది వర్తిస్తుంది. పాఠశాలలు, వ్యాపారాల వంటి సంస్థల ఖాతాలపై ప్రభావం ఉండు.
యాక్టీవ్ చేసుకోవడం ఎలా..?
మీరు మీ గూగుల్ అకౌంట్‌ని యాక్టీవ్ చేసుకునేందుకు కనీసం రెండేళ్లకు ఒకసారైనా సైన్ ఇన్ చేయాలి. ఇది కాకుండా గూగుల్ అకౌంట్‌కి సంబంధించి మరేదైనా సేవల్లో సైన్ ఇన్ చేసి ఉంటే డీయాక్టివేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఈ క్రింది చర్యల వల్ల అకౌంట్‌ని యాక్టివేషన్‌లో ఉంచుకోవచ్చు.
* ఈమెయిల్ చదవడం లేదా పంపడ
* గూగుల్ డిస్క్‌ని ఉపయోగించడం
*యూట్యూబ్ వీడియోలు చూడటం
* గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం
* గూగుల్ సెర్చ్ చేయడం
* థర్డ్ పార్టీ యాప్స్ కోసం గూగుల్ సైన్ ఇన్ చేయడం
* మీరు మీ గూగుల్ అకౌంట్‌ని గూగుల్ వన్, వార్తల ప్రచురణ లేదా యాప్ వంటి వాటికి సబ్స్‌స్క్రిప్షన్ కలిగి ఉంటే మీ గూగుల్ అకౌంట్‌పై ఎలాంటి ప్రభావం పడదు. దీంతో పాటు గూగుల్ వీడియోలతో లింక్ అయిన గూగుల్ అకౌంట్లను తొలగించే ఉద్దేశం ప్రస్తుతానికి గూగుల్‌కి లేదు.