Sowa Fish: పాకిస్తాన్‌కి చెందిన ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని వలలో చిక్కిన ఓ చేప అతని తలరాతనే మార్చేసింది. కరాచీ నగరంలోని నిరుపేద మత్స్యకారుడైన హాజీ బలోచ్ అత్యంత అరుదైన చేప చిక్కింది. ఇది కోట్లలో రేటు పలకడంతో అతని దశ తిరిగింది.
వివరాల్లోకి వెళితే.. పాక్ లోని ఇబ్రహీం హైదరీ అనే మత్స్యకార గ్రామంలో నివసించే హాజీ బలోచ్, అతని వర్కర్స్ సోమవారం అరేబియా సముద్రంలో వేటకు వెళ్లారు. వీరికి అత్యంత అరుదైన గోల్డెన్ ఫిష్ స్థానికంగా ‘‘సోవా’’గా పిలిచే చేపలను పట్టుకున్నారు. శుక్రవారం కరాచీ నౌకాశ్రయంలో వీటిని వేలం వేయగా వారికి పాక్ కరెన్సీలో దాదాపుగా 70 మిలియన్ రూపాయలకు అమ్ముడయ్యాయని పాకిస్తాన్ ఫిషర్ మెన్ ఫోక్ ఫోరమ్‌కి చెందిన ముబారక్ ఖాన్ వెల్లడించారు.
Read Also: Javed Akhtar: “హిందువులు సహనంతో ఉంటారు, వారి నుంచి నేర్చుకుంటున్నాం”.. జావేద్ అక్తర్ ప్రశంసలు..
సోవా చేపలను అమూల్యమైనవిగా భావిస్తారు. వీటి నుంచి వచ్చే పదార్థాలు వైద్యానికి ఉపయోగిస్తారు. వీటిలో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయని నమ్ముతారు. చేపల నుంచి వచ్చే దారం లాంటి పదార్థాన్ని శస్త్ర చికిత్స విధానాల్లో ఉపయోగిస్తారు.
తరుచుగా 20 నుంచి 40 కిలోల బరువు 1.5 మీటర్ల వరకు పెరిగే ఈ చేప తూర్పు ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక చేప వేలంలో 7 మిలియన్ రూపాలయలు పలికిందని మత్స్యకారుడు హాజీ బలోచ్ చెప్పారు. ఈ డబ్బును తన ఏడుగురు సిబ్బందితో పంచుకుంటానని తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో మాత్రమే ఈ చేపలు తీరానికి వస్తుంటాయి.