India at UN: తూర్పు జెరూసలేంలో పాటు ఆక్రమిత పాలస్తీనా భూభాగం, ఆక్రమిత సిరయన్ గోలన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సెటిల్మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితితో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఇజ్రాయిల్ వైఖరిని ఖండిస్తూ భారత్ ఓటసింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటేయగా అందులో భారత్ కూడా ఉంది. ఈ ముసాయిదా తీర్మానానికి నవంబర్ 9 గురువారం ఆమోదం లభించింది.
CM Pinarayi Vijayan: కేరళలో పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పాలస్తీనా సంఘీభావం ర్యాలీలను చేపడుతున్నాయి. శనివారం కోజికోడ్ వేదికగా అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కేరళ సీఎం పినరయి విజయన్ పాల్గొన్నారు.
Kerala: కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. వరి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దక్షిణ జిల్లాలోని కట్టనాడ్ ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది. వరి రైతు కేజీ ప్రసాద్ సూసైడ్ నోట్ రాసి.. తన ఆత్మహత్యకు రాష్ట్రప్రభుత్వం, కొన్ని బ్యాంకులు కారణమని ఆరోపించారు. ఈ ఆత్మహత్య కేరళలో పొలిటికల్ దుమారాన్ని రేపింది.
Israel: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్‌పై దాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ చెప్పింది. అమెరికాతో పాటు ఇతర యూరోపియన్, అరబ్ దేశాలు చెప్పినా కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్ వినే పరిస్థితిలో లేదు. గాజాపై భూతల దాడులు చేస్తోంది. హమాస్ టన్నెల్ వ్యవస్థతో పాటు కీలక ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే ప్రయత్నంలో ఉంది.
Uttar Pradesh: గత పదేళ్లుగా దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయి. కేంద్రంలోని ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొంత మంది మళ్లీ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ఈ రోజు సౌదీ అరేబియా వేదికగా ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేటివ్(ఓఐసీ) రియాద్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాపై జరుపుతున్న దాడిపై ఈ దేశాలు చర్చించాయి. గాజా స్ట్రిప్ లో ప్రస్తుత యుద్ధం గురించి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఆర్మీని ‘‘ఉగ్రవాద సంస్థ’’గా ప్రకటించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ శనివారం ఇతర ఇస్లామిక్ దేవఆలకు పిలుపునిచ్చారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం గాజాను అంధకారంలో పడేసింది. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ దాడులు అక్కడి సాధారణ ప్రజానీకాన్ని కష్టాలపాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ వరసగా దాడులను తీవ్రతరం చేయడంతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో సేవలు స్తంభించాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రైన అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిందని హమాస్ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంధనం లేక చివరి జనరేటర్ కూడా నిలిచిపోయిందని ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ…
Dal lake: ప్రముఖ పర్యాటక ప్రాంతం శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. సరస్సులోని బోట్‌హౌజులను అగ్ని చుట్టుముట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా బంగ్లాదేశ్‌కి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 5 హౌజ్ బోట్లు ధ్వంసమయ్యాయి.
Supreme Court: తన హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో ‘నేను బతికే ఉన్నాను’ అంటూ ఓ పిల్లాడు కోర్టు ముందుకు రావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తులతో పాటు అంతా షాక్ అయ్యారు. తన హత్య బూటకమని 11 ఏళ్ల బాలుడు ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యాడు. బాలుడి తండ్రి, తన భార్య తరుపు కుటుంబం తన కొడుకును చంపాడని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదలైంది.
Asaduddin Owaisi: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని పెళ్లి పెద్దగా, ఖాజీగా అభివర్ణించింది. ఈ పోస్టర్‌పై అసదుద్దీన్ స్పందించారు. బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అందరికి పెళ్లి కొడుకునా.. లేక సోదరుడినా..? ’’ అంటూ ప్రశ్నించారు.