Congress: “కొందరు కాంగ్రెస్ నేతలు రాముడిని, హిందువులను ద్వేషిస్తారు”.. సొంత పార్టీపై సీనియర్ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: సీనియర్ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం, సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు రాముడి, హిందువులను ద్వేషిస్తున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని ద్వేషించే వ్యక్తి హిందువు కాలేడని, రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉండటం అంటే నిజం చెప్పలేనని అర్థం కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హిందువుల మద్దతు కోరుకోకపోవచ్చని, వారు హిందూ మతగురువులను అవమానించాలని అనుకుంటున్నారని, అందుకే తనను స్టార్ క్యాంపెనర్‌గా గుర్తించడం లేదని ఆయన అన్నారు. ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ.. కూటమి అనేదేమీ లేదని నేను భావిస్తున్నని అన్నారు. ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం ప్రధాని మోడీని ఓడించి, బీజేపీని గద్దె దించడమేనని, అయితే విపక్షాలు మోడీని ఎంత ద్వేషిస్తున్నారో.. వారు భారతదేశాన్ని కూడా అంతే ద్వేషించడం ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్‌ని ప్రారంభిస్తే, దాన్ని వ్యతిరేకిస్తారు, వందేభారత్ అని రైలుకు పేరు పెడితే దాన్ని వ్యతిరేకిస్తారు, ప్రతిపక్షం గందరగోళంగా మారిందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
మహిళలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఇండియా కూటమి నేతలు విమర్శించడం లేదని, ప్రతీ దానికి మోడీనే నిందిస్తున్నాంటూ మండిపడ్డారు. ప్రతిపక్షాలు తప్పులన్నింటిని మోడీపై మోపాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడంపై వస్తున్న ఊహాగానాలపై మాట్లాడుతూ…భారత్, సనాతనం గురించి మాట్లాడితే బీజేపీలో చేరాలనుకున్నట్లు అర్థం కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకా గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని కూడా చెప్పారు. మోడీకి పోటీ ఇవ్వాలనుకుంటే ప్రియాంకాగాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని అన్నారు.
ఆచార్య ప్రమోద్ కృష్ణం వ్యాఖ్యలపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వసర్మ స్పందించారు. ‘‘ కాంగ్రెస్ సీనియర్ నేత, గాంధీ కుటుంబ విధేయుడు ఆచార్య ప్రమోద్ జీ చెప్పేదాన్ని నేను ధృవీకరిస్తున్నాను. నిర్దిష్ట ఓటు బ్యాంకుకు భయపడి, శ్రీరాముడు అంటే కాంగ్రెస్ పార్టీకి అలెర్జీ’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. కృష్ణం వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్.. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని, దానికి రాహుల్ గాంధీనే అతిపెద్ద ఉదాహరణ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ అన్నారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..