Israel-Hamas War: గాజాలో హమాస్ ఉగ్రసంస్థను తుడిచిపెట్టేలా ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తోంది. భూతలదాడుల్లో హమాస్ ఉగ్రవాదలను హతమారుస్తోంది. హమాస్ ఉగ్రసంస్థకు కేంద్రాలుగా ఆస్పత్రులను ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రి కిందనే హమాస్ కమాండ్ సెంటర్ తో పాటు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది.
Himanta Biswa Sarma: మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌పై అస్సా్ం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌ని టార్గెట్ చేశారు. భగవాన్ మహదేవ్‌ని కూడా విడిచి పెట్టడం లేదని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 17న ఛత్తీస్‌గఢ్ రెండో విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున హిమంత ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేతలకు, నక్సలైట్లకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. గిరిజనులను మతమార్పిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
Hijab: కర్ణాటక ఎగ్జామ్ అథారిటీ(కేఈఏ) తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ విమర్శలకు దారి తీసింది. రిక్రూట్మెంట్ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎలాంటి డ్రెస్ కోడ్‌లో హాజరుకావాలో తెలియజేసే మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది. అయితే ఇందులో తలను, చెవులను కప్పిఉంచే వస్త్రాలను, టోపీలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్షల్లో కాపీయింగ్, బ్లూటూత్ డివైసెస్ వాడకుండా పకడ్బందీ చర్యల్లో ఈ నియమావళిని తీసుకువచ్చినట్లు చెప్పింది.
Arvind Kejriwal: ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కించపరిచేలా, అవమానకరమైన పోస్టులను షేర్ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల్లో ప్రధానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనపై గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది.
PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. ప్రధాని నరంద్రమోడీ ఈ రోజు బీతుల్ జిల్లా బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. భారీగా హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. బీజేపీ విజయం ఖాయమైందని అన్నారు.
Israel-Hamas War: గాజాపై ఇజ్రాయిల్ సైన్యం పట్టు సాధిస్తోంది. హమాస్ వ్యవస్థను నేలమట్టం చేసేందుకు ఉత్తర గాజాను ముఖ్యగా గాజా నగరాన్ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చుట్టుముట్టింది. గాజాలో భూతల దాడుల ద్వారా హమాస్ ఉగ్రస్థావరాలను నేలకూల్చుతోంది. ముఖ్యంగా హమాస్ ఉగ్రవాదులకు, వారి టన్నెట్ వ్యవస్థకు రక్షణగా ఉన్న ఇజ్రాయిల్ లోని పలు ఆస్పత్రులను ఐడీఎఫ్ చుట్టుముట్టింది. ముఖ్యంగా అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తోంది.
Canada: కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం రోజురోజుకు పెరుగుతోంది. ఖలిస్తాన్ పేరు చెబుతూ కొందరు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. కెనడాలోని హిందూ మందిరాలపై దాడులు చేయడంతో పాటు హిందువులను బెదిరించడం కూడా గతంలో చూశాం. తాజాగా ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు. దీపావళి వేడుకల్లోకి వచ్చి ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు.
High Court: భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉంటున్న వ్యక్తికి సంబంధించిన కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కామపూరిత, వ్యభిచార జీవితం’’ గడుపుతూ, భార్యకు విడాకులు ఇవ్వని వేరే మహిళతో ఉంటున్న వ్యక్తి సంబంధాన్ని ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’’ అని పిలువలేమని కోర్టు అభిప్రాయపడింది. తమ ప్రాణాలకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ కుల్దీప్ తివారీతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది.
Congress: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ కీలుబొమ్మ అని ఇటీవల ఓవైసీ విమర్శించారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. బీజేపీ పోటీని సులభతరం చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ఓట్లను చీల్చుతున్నాడని అందరికి తెలుసని ఆయన ఆరోపించారు. ఓట్లను కోయడంలో అసదుద్దీన్ ప్రసిద్ధి చెందారని, ఈ విషయం దేశం మొత్తానికి తెలుసని, బీజేపీ నుంచి…
Bihar: బీహార్‌లోని జాముయి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌తో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని తొక్కించి చంపేశారు. ఈ ఘటనలో హోంగార్డుతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన జముయ్ లోని మహులియా తాండ్ గ్రామంలో చోటు చేసుకుంది. చనిపోయిన ఎస్సై ప్రభాత్ రంజన్‌గా గుర్తించారు. అతని సొంత జిల్లా సవాయ్ కాగా.. గర్హి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. ఘటన తర్వాత అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా…