Fire Accident: ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం చూస్తు్న్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాలో ఈ రోజు న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్లీపర్ కోచ్ లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించి అప్రమత్తం చేశారు.
Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ గౌరవించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో రాముడి ఆలయం వచ్చేదా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున యోగి ప్రచారం చేశారు. ఎంపీలోని పావై, అశోక్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీకి దేశవ్యాప్తంగా అభినందనలు అందుతున్నాయి. ఈ రోజు న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచులో విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. 50వ సెంచరీ సాధించారు.
Snake Robot: నాసా.. అమెరికా అంతరిక్ష సంస్థ. ప్రస్తుతం అనేక దేశాలతో పోలిస్తే నాసా అంతరిక్ష ప్రయోగాల్లో ముందుంది. ఆర్టిమిస్ మిషన్ ద్వారా చంద్రుడిపైకి మానవుడిని పంపించేందుకు సిద్ధమౌతోంది. ఇదే కాకుండా భవిష్యత్తులో అంగారకుడి పైకి కూడా మానవ సహిత యాత్రలను నిర్వహించాలనే లక్ష్యంతో ఉంది.
Pakistan: పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మరో ఇద్దరు భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్ ముజామిల్, నయీమూర్ రెహ్మన్‌లను సియాల్కోట్ నగరంలో హతమార్చారు. పోలీస్ యూనిఫాం ధరించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దర్ని కాల్చివేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ…
Maldives: మాల్దీవులకు మహ్మద్ ముయిజ్జు ప్రెసిడెంట్ కాబోతున్నారు. భారత వ్యతిరేక హమీలతో ఆయన అక్కడి ప్రజల నుంచి ఓట్లు సంపాదించారు. ఇందులో ముఖ్యంగా మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను పంపించేస్తానని ఎన్నికల హమీ ఇచ్చారు. గతంలో ప్రెసిడెంట్‌గా ఉన్న ఇబ్రహీం సోలీహ్ భారత అనుకూలంగా వ్యవహరించారు.
Shehla Rashid: ఒకప్పుడు ప్రధాని నరేంద్రమోడీని విపరీతంగా వ్యతిరేకించే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ ప్రస్తుతం పొగడ్తల వర్షం కురిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితికి ప్రధాని మోడీకి, హోమంత్రి అమిత్ షాలకు థాంక్స్ చెప్పారు. గతంలో తాను కాశ్మీర్ లో రాళ్లు విసిరే వారిపై సానుభూతితో వ్యవహరించానని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని షెహ్లా రషీద్ అన్నారు.
Teacher: అమెరికాలో విద్యార్థి-ఉపాధ్యాయుడి బంధానికి విలువ లేకుండా పోయింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే తప్పు దారి పడుతున్నారు. తమ విద్యార్థులతో అనైతిక బంధాన్ని పెట్టుకుంటున్నారు. శారీరక సుఖం కోసం విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇటాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా టీచర్, 14 ఏళ్ల విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Harbhajan Singh: పాకిస్తాన్ మాజీ స్టార్ క్రికెటర్ ఇంజామ్ ఉల్ హక్, హర్భజన్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ తో భారత్ సిరీస్‌లో మౌలానా తారిఖ్ జమీల్ చెప్పిన మాటలు విని హర్బజన్ సింగ్ ఇస్లాంలోకి మారేందుకు సిద్ధమయ్యాడని, అతను ఇస్లాంను కప్పిపుచ్చుకోవాలని అనుకుంటున్నాడని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
China: చైనా మరోసారి సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ని ఆవిష్కరించింది. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ డేటాను ట్రాన్స్ఫర్ చేయగలదని దీన్ని సదరు కంపెనీ వెల్లడించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఈ వేగం ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ వేగంతో పోలిస్తే దాదాపుగా 10 రెట్లు అని చెప్పింది.