Shreyas Iyer: స్వదేశంలో జరుగున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజయానికి తిరుగులేకుండా పోయింది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌కి చేరుకుంది. వరల్డ్ కప్‌ని ముద్దాడటానికి కేవలం ఒక్క విజయానికి దూరంలో ఉంది. బుధవారం న్యూజిలాండ్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచు అనేక రికార్డులకు వేదికగా మారింది.
China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులోని లిషి జిల్లాలో లియులియాంగ్ నగరంలోని ఐదు అంతస్తుల భవనంలో ఓ ప్రైవేట్ బొగ్గు గని సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం 7 గంటల ప్రాతంలో మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో ఉన్న ఈ కార్యాలయం నుంచి మిగతా అంతస్తులకు మంటలు విస్తరించాయి. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో 26 మంది మరణించారు. 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
Hamas: గాజాలో హమాస్ బందీలపై థాయ్‌లాండ్ రాజకీయ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యవర్తుల సంధి కుదిరితే, విడుదలయ్యే బందీల్లో థాయ్ దేశానికి చెందిన వారంతా ఉంటారని, ఇలా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ తమకు హమీ ఇచ్చిందని థాయ్-ముస్లిం రాజకీయ నేతలు గురువారం తెలిపారు. ఏదైనా కాల్పుల విరమణ జరిగితే 3-5 రోజుల్లో బందీలను విడుదల చేస్తుందని, అందులో థాయ్ ప్రజలు ఉంటారని థాయ్-ఇరాన్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లెపాంగ్ సయ్యద్ బ్యాంకాక్ పార్లమెంట్ భవనంలో మీడియాతో వెల్లడించారు.
BJP: ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ సారి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని దింపేయాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ ఓటర్ల సెంటిమెంట్ రిపీట్ చేస్తారని బీజేపీ భావిస్తోంది. రాజస్థాన్ లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేదు. ఇది తమకు కలిసి వస్తోందని బీజేపీ అనుకుంటోంది.
Man Kills Niece's Lover: ఇటీవల కాలంలో ప్రేమ సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. యువతీ యువకులు ప్రేమించుకోవడం, అది పెద్దలకు నచ్చకపోవడంతో వివాదాలు మొదలవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కులాలు వేరు కావడంతో పరువు హత్యలకు దారి తీస్తోంది. ఇటీవల కాలంలో మనం చాలా సందర్భాల్లో ఇలాంటి హత్యల్ని చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే జరిగింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల సంఘం తెలిపింది. రిగ్గింగ్ అవుతుందనే భయంతో ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని బెదిరించాయని ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ బుధవారం తెలిపారు. బంగ్లాదేశ్ లోని 300 స్థానాలకు 12వ పార్లమెంటరీ ఎన్నికలు జనవరి 7న జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ హబీబుల్ అవల్ తెలిపారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు పార్టీలు చర్చలు జరపాలని కోరారు.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. పీఓకే, భారత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద చొరబాటు యత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపారు.
Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ టన్నెల్లో చిక్కుకుపోయిన 40 మంది కూలీల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయపనులు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సాంకేతిక కారణాలు, కొండచరియలు విరిగిపడటం సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన కూలీల కోసం భారత వైమానిక దళానికి చెందిన మూడు ప్రత్యేక విమానాలు 25 టన్నుల ప్రత్యేక యంత్ర సామాగ్రిని సరఫరా చేసింది.
Babar Azam: ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటోంది. పాక్ మాజీ క్రికెటర్లు ప్లేయర్లను ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాల నేపథ్యంలో, బుధవారం అన్ని పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ నుంచి వైదొగులుతున్నట్లు బాబార్ ఆజమ్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్నాడు.
Star Hospital: ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా స్టార్ హాస్పిటల్ డెడికేటెడ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించింది. స్టార్ హాస్పిటల్ తన అత్యాధునిక క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనాలజీ డిసీజ్ (COPD) స్పెషాలిటీ క్లినిక్‌ను ఈరోజు ప్రపంచ COPD దినోత్సవం సందర్భంగా ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఈ క్లినిక్ COPDతో బాధిత రోగులకు ప్రత్యేక సంరక్షణ అందించడంతో పాటు వ్యాధి నిర్వహణ గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం కోసం స్టార్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ కలిగిన ప్రత్యేక…