Israel-Hamas War: గాజాలో హమాస్ ఉగ్రసంస్థను తుడిచిపెట్టేలా ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తోంది. భూతలదాడుల్లో హమాస్ ఉగ్రవాదలను హతమారుస్తోంది. హమాస్ ఉగ్రసంస్థకు కేంద్రాలుగా ఆస్పత్రులను ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. ఈ ఆస్పత్రి కిందనే హమాస్ కమాండ్ సెంటర్ తో పాటు కీలక ఉగ్రవాదులు ఉన్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. ఆస్పత్రిపై దాడి కారణంగా విద్యుత్ వంటి సౌకర్యాలు దెబ్బతిన్నాయి. అయితే అందులో చికిత్స పొందుతున్న నవజాత శిశువుల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 30 మందికి పైగా శిశువులు ఆస్పత్రిలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు మరణించినట్లుగా హమాస్ ఆరోగ్య విభాగం తెలిపింది. ఇదిలా ఉంటే ఇందులోని రోగులను బయటకు వెళ్లకుండా హమాస్ అడ్డుకుంటుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.
Read Also: Jk Bus Accident: జమ్యూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 30 మంది మృతి
ఇదిలా ఉంటే గాజాలోని విధ్వంసంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో మహిళలు, పిల్లలు, శివువుల హత్యలు ఆగాలని ఆయన అన్నారు. అతని వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ ప్రధాని సీరియస్ గానే స్పందించారు. దీనికి కారణం హమాస్ అని, ఇజ్రాయిల్ కాదని అన్నారు. దీనిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. 1200 మంది ఇజ్రాయిలీలలను చంపిని అక్టోబర్ 7 దాడిని ప్రస్తావిస్తూ.. ‘‘ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుంది ఇజ్రాయిల్ కదాని, హోలోకాస్ట్ తర్వాత యూదులపై జరిగిన అత్యంత ఘోరమైన భయానక సంఘటనలో హమాస్ ఉగ్రవాదులు పౌరుల తలలు నరికేసి, కాల్చివేసి, ఊచకోత కోశారు.’’ అని అన్నారు. ఇజ్రాయిల్ పౌరులకు హాని కలిగించకుండా చేస్తుంటే, హమాస్ వారికి హాని కలిగించేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తోందని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయిల్ గాజాలోని పౌరులకు ఏం కాకుండా మనవతా కారిడార్, సేఫ్ జోన్లు అందించినప్పుడు, హమాస్ వారు ఎక్కడికి వెళ్లకుండా తుపాకులతో అడ్డుకుంది అని తెలిపారు.
యుద్ధ నేరానికి పాల్పుడుతోంది హమాస్ అని, ఇజ్రాయిల్ దాని, దీనికి హమాస్ బాధ్యత వహించాలని, పౌరుల వెనక దాక్కుని, ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటున్న హమాస్ అనాగరికతను ఓడించడానికి నాగరిక శక్తులు ఇజ్రాయిల్ కి మద్దతు ఇవ్వాలని ప్రధాని నెతన్యాహు కోరారు. గాజా స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం. ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇప్పటికే ఈ దాడుల్లో పాలస్తీనియన్లు 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1.5 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. వీటిపై మాట్లాడిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇజ్రాయిల్ ప్రభుత్వం సంయమనం పాటించాలని , తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వైద్యులు, కుటుంబసభ్యులు, ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యాలను మేము వింటున్నాము అని ట్రూడో అన్నారు. ఈ హత్యలని ప్రపంచం చూస్తోందని అన్నారు. అలాగే హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయిల్ పౌరులను వదిలేయాలని కెనడా ప్రధాని కోరారు.
It is not Israel that is deliberately targeting civilians but Hamas that beheaded, burned and massacred civilians in the worst horrors perpetrated on Jews since the Holocaust.
While Israel is doing everything to keep civilians out of harm’s way, Hamas is doing…
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) November 15, 2023