48 ఏళ్ల వయసున్న పొలిట్కోవ్స్కాయాను మాస్కోలోని ఆమె అపార్ట్మెంట్ బ్లాక్ లోని లిఫ్టులో కాల్చి చంపారు. ఆమె ఇండిపెండెంట్ నోవాయా గెజిలా వార్తా పత్రికకు పనిచేసేది. ఈ హత్యలో శిక్ష అనుభవిస్తున్న వారిలో ఖడ్జికుర్బనోవ్ ఒకరు. ఆమె గతంలో చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్ అట్రాసిటీలను ఖండిస్తూ అధ్యక్షుడు పుతిన్‌ని విమర్శించింది.
బ్రిటిష్ సైనిక కార్గో విమానం రావల్పిందిలోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నూన్ ఖాన్ నుంచి సైప్రస్, అక్రోతిరిలోని బ్రిటిష్ సైనిక స్థావరానికి, అక్కడి నుంచి రోమేనియాకు వెళ్ళింది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేసేందుకు మొత్తం ఐదుసార్లు ఇలా వెళ్లినట్లు బీబీసీ ఉర్దూ సోమవారం నివేదించింది. అయితే పాక్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఉక్రెయిన్‌కి గానీ, దాని పక్క దేశం రొమేనియాకు కానీ ఎలాంటి ఆయుధాలను అందించలేదని చెప్పింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేశారు. ఈ దాడిలో 1400 మంది ఊచకోత కోశారు, మరో 200 మంది వరకు ప్రజల్ని బందీలుగా చేసుకుని గాజా ప్రాంతంలోకి తరలించారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్ పై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్‌ని నేలకూల్చే వరకు విశ్రమించేంది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. హమాస్ ఉగ్రస్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం గాజాలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)…
Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్ రంగంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. గతేడాది నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ(కేఈఏ) రిక్రూట్మెంట్ పరీక్షలు జరిగే సమయంలో అభ్యర్థుల డ్రెస్ కోడ్‌లో కీలక మార్పులు చేసింది. తను పూర్తిగా కప్పేలా టోపీలు లేదా దుస్తులు ధరించిన వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించబోమని చెప్పింది. పరీక్షల్లో బ్లూటూత్ పరికరాలు ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశం ఉండటంతో ఉద్యోగ నియామక బోర్డులు, కార్పొరేషన్ నియమాక పరీక్షల్లో తలను కప్పి ఉంచే అన్ని రకాల దస్తులను నిషేధించింది.
Pakistan: పాకిస్తాన్లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. ఎవరు చంపుతున్నారో..ఎందుకు చంపుతున్నారో అక్కడి ప్రభుత్వానికి అంతుబట్టడం లేదు. కిడ్నాప్ కావడమో, లేకపోతే ఏదైనా పనికోసం బయటకు వల్లే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదుల్ని లేపేస్తున్నారు. బయటకు వెళ్లిన ఉగ్రవాది ప్రాణాలతో ఉంటాడో లేడో తెలియని పరిస్థితి. భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని తమ సొంత ఆస్తులుగా పరిగణిస్తూ.. వారికి రక్షణ కల్పిస్తున్న పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఈ హత్యలు ఎవరు చేస్తున్నారని పాలుపోవడం లేదు. కిడ్నాప్ అయిన వారి కోసం దేశం మొత్తం…
Karnataka: కర్ణాటక ఉడిపి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ, ఆమె ముగ్గురు కుమారులను గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి చంపారు. బాధితులు తెల్లవారుజామున ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. దుండగులు ముందుగా మహిళను చంపిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చంపారని, వీరి తర్వాత 12 ఏళ్ల కుమారుడిని కూడా చంపేశారని పోలీసులు వెల్లడించారు.
Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కేవలం మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 17న రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దశాబ్ధానికి పైనా పాలిస్తున్న బీజేపీని అధికారంలోకి దించేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది.
Diwali: దేశం అంతటా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు పటాకుల సందడితో, తారాజువ్వల వెలుగులతో అందంగా మారాయి. అయితే తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని 7 గ్రామాలు మాత్రం నిశ్శబ్ద దీపావళిని జరుపుకుంటారు. కాంతి వెలుగులు లేకుండా, శబ్ధాలు రాకుండా ఈ గ్రామాల్లో దీపావళి జరుగుతుంది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ పలు దేశాలకు తన ఆయుధాలను విక్రయిస్తోంది. ఇటీవల నాటోలో కొత్త సభ్యుడిగా చేరిన ఫిన్లాండ్ దేశానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయిల్ తన డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని ఫిన్లాండ్కి విక్రయించడానికి 340 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీనిని చారిత్రక ఒప్పందంగా ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్, యూఎస్ కంపెనీలు కలిసి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. క్రూయిజ్ క్షిపణలు, విమానాలు, డ్రోన్లను కూడా ఈ…