Canada: దీపావళి వేడుకల్లో ఖలిస్తానీ నినాదాలు.. హిందువులు, ఖలిస్తానీల మధ్య ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం రోజురోజుకు పెరుగుతోంది. ఖలిస్తాన్ పేరు చెబుతూ కొందరు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. కెనడాలోని హిందూ మందిరాలపై దాడులు చేయడంతో పాటు హిందువులను బెదిరించడం కూడా గతంలో చూశాం. తాజాగా ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు. దీపావళి వేడుకల్లోకి వచ్చి ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు.
కెనడాలోని బ్రాంప్టన్‌లో దీపావళి వేడకలు సందర్భంగా ఖలిస్తానీ మద్దతుదారుల గుంపు హిందువులతో ఘర్సనకు దిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖలిస్తానీ జెండాలను మోసుకెళ్తున్న గుంపు, కొన్ని వస్తువులను తీసి దీపావళి వేడకలు జరుపుకుంటున్న హిందూ సమూహంపై విసిరినట్లు వీడియోలో ఉంది. ఈ సంఘటన మాల్టన్ లోని వెస్ట్‌వుడ్ మాల్‌లో జరిగింది. వీడియోలో పోలీసులు జనాలను వెనక్కి వెళ్లమని చెప్పడం కనిపిస్తుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హింస, ప్రార్థనా స్థలాలు, మైనారిటీలపై జాతిపరమైన దాడులు, ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాలను ప్రేరేపించడం కోసం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని కెనడాకు భారత్ చెప్పిన చెప్పిన వారం రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Read Also: High Court: భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళలతో ఉండటంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ఇప్పటికే ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్య వివాదాన్ని పెంచాయి. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కెనడా అసంబద్ధ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోందని, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విమర్శించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సమానత్వం ఉండేందుకు ఇటీవల ఇండియాలో ఎక్కువగా ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలను దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. గడువు మించి ఉన్నట్లయితే దౌత్యపరమైన రక్షణలను తీసేస్తామని చెప్పింది. చేసేదేం లేక కెనడా తన దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకుంది.
A fight between Sikhs and Hindus took place on Diwali last night in Brampton 😳 pic.twitter.com/Fkqh2QB0fU
— 6ixBuzzTV (@6ixbuzztv) November 13, 2023
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!