Bihar: “ఇలాంటివి కొత్త కాదు”.. పోలీస్ అధికారి హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్‌లోని జాముయి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌తో పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్‌ని తొక్కించి చంపేశారు. ఈ ఘటనలో హోంగార్డుతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన జముయ్ లోని మహులియా తాండ్ గ్రామంలో చోటు చేసుకుంది. చనిపోయిన ఎస్సై ప్రభాత్ రంజన్‌గా గుర్తించారు. అతని సొంత జిల్లా సవాయ్ కాగా.. గర్హి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఘటన తర్వాత అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది.
ఈ హత్యపై బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు కొత్త కాదని, ఇవి జరుగుతూనే ఉన్నాయని, గతంలో ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ కేసులో నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని మంత్రి తెలిపారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో
చనిపోయిన పోలీస్ అధికారి ప్రభాత్ రంజన్‌కి నాలుగేళ్ల కుమార్తె, 6 నెలల కుమారుడు ఉన్నారు. అతని కుటుంబం మొత్తం ఢిల్లీలోనే ఉంటుంది. జముయ్ ఘటనలో గాయపడిన హోంగార్డును రాజేష్ కుమార్‌గా గుర్తించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన మిథిలేష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శౌర్య సుమన్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నాడు.
మరోవైపు ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జముయ్ ఎంపీ చిరాగ్ పాశ్వార్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక స్మగ్లర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ప్రజలు నదిలో మునిగి చనిపోతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు ముందు బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ నెల ప్రారంభంలో ఇదే విధమైన సంఘటన జరిగింది. అక్రమం ఇసుక రవాణా చేస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌ని మాఫియా చితకబాదింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!