Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును కాల్చి చంపాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. గాజాపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1400 మందిని హతమార్చడమే కాకుండా.. 240 మందిని బందీలుగా చేసుకుని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటికే అక్కడ ఇజ్రాయిల్ దాడుల వల్ల 11 వేల మంది చనిపోయారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ వార్ మనదేశంలో కూడా రాజకీయాంశంగా మారింది. ముఖ్యంగా కేరళలో హమాస్, పాలస్తీనాలకు మద్దతుగా అక్కడి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్క అధికార సీపీఎం పార్టీనే కాకుండా కాంగ్రెస్, ముస్లింలీగ్ వంటి పార్టీలు కూడా పోటాపోటీగా ర్యాలీలు చేస్తున్నాయి. ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో జరిగిన మద్దతు ర్యాలీలో ఇండియా, ఇజ్రాయిల్ తో పలు ఒప్పందాలను రద్దు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
Read Also: Animal: అర్జున్ రెడ్డి మత్తు నుంచి ఇంకా బయటకు రాలేదా అన్న..
ఇక ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధంగా ర్యాలీలు నిర్వహించింది. కోజికోడ్ వేదికగా ఆ పార్టీ పాలస్తీనా సంఘీభావ ర్యాలీ చేసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాసర్‌గోడ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లడుతూ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ యుద్ధ నేరస్తుడని, విచారణ లేకుండా కాల్చి చంపాలని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధనేరాల్లో నిమగ్నమైన వారిని న్యూరెమ్‌బర్గ్ ట్రయల్స్ అని పిలిచేవారు, ఎలాంటి విచారణ లేకుండా నేరస్తులను కాల్చి చంపారు, ఇదే విధంగా నెతన్యాహును కాల్చి చంపాల్సిన సమయం వచ్చిందని, ఎందుకంటే అతడు చేస్తున్న క్రూరత్వం ఆ స్థాయిలో ఉందని అన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నవంబర్ 23న కోజికోడ్ వేదికగా కేరళ పీసీసీ భారీ మద్దతు ర్యాలీని నిర్వహించబోతోంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాలస్తీనా అనుకూల కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!