Akbaruddin Owaisi: “నన్ను ఎవరూ ఆపలేరు”.. పోలీసులను బెదిరించిన అక్బరుద్దీన్ ఓవైసీ.. కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akbaruddin Owaisi: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరో వివాదంలో ఇరుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో పోలీసులను బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమయానికి మించి ప్రచారం చేయడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంపై పోలీసులు అభ్యంతరం చెప్పడంతో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ని బెదిరించాడు.
‘‘ఇన్‌స్పెక్టర్ సాబ్, నా దగ్గర వాచ్ ఉంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్లండి’’ అంటూ పోడియ నుంచి వేదిక వైపు వెళ్లి పోలీస్ అధికారిని వెళ్లమని హెచ్చరిక చేశాడు. తను మాట్లాడకుంటా ఎవరు ఆపలేరని, నేను ఒక్క సిగ్నల్ ఇస్తే, ప్రజలు పోలీసు అధికారిని పరిగెత్తిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
‘‘కత్తులు, బుల్లెట్లు ఎదుర్కొంటే నేను బలహీనుడిని అయ్యానని అనుకుంటున్నావా..? నాలో చాలా ధైర్యం ఉంది. ఐదు నిమిషాలు మిగిలి ఉన్నాయి. ఐదు నిమిషాలు మాట్లాడుతాను. నన్ను ఎవరూ ఆపలేరు. నేను సిగ్నల్ ఇస్తే మీరు ఇక్కడి నుంచి పారిపోతారు. అలా చేద్దామా..?’’ అని అన్నారు. అక్బరుద్దీన్ చాంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Read Also: Etela Rajender: రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బంధు చేశారు: ఈటెల
ఈ బెదిరింపులపై అక్బరుద్దీన్ ఓవైసీపై ఐపీసీ 06 IPC, 153 IPC, 505(2) మరియు 506 మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 125 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే దీనిపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తన సోదరుడిని ఎందుకు మాట్లాడనీయకుండా చేశారని ప్రశ్నించారు. దీనిపై ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ స్పందిస్తూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అక్బరుద్దీన్‌పై బుల్డోజర్ యాక్షన్ ఉంటుందని ట్వీట్ చేసింది. దశాబ్ధాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం ఓల్డ్ సిటీని నాశనం చేస్తోందని, నేరాలకు అడ్డాగా మార్చిందని బీజేపీ ఆరోపించింది. తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
#WATCH | Telangana: AIMIM leader Akbaruddin Owaisi threatened a police inspector who was on duty and asked him to leave the spot while he was addressing a campaign in Lalitabagh, Hyderabad yesterday. The police inspector asked him to conclude the meeting on time as per the Model… pic.twitter.com/rf2tJAOk3b
— ANI (@ANI) November 22, 2023
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు