Bulldozers roadshow: రాజస్థాన్ చివరి రోజు ప్రచారం హోరెత్తింది. ఈ నెల 25న రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు జోరుగా ప్రచారం సాగించారు. గురువారం చిత్తోర్‌గఢ్ జిల్లాలోని నింబహెరా, రాజ్ సమంద్ జిల్లాల్లో నాథ్ద్వారాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలు కూడా జైపూర్‌లోని వివిధ అసెంబ్లీల్లో బీజేపీ అభ్యర్థుల తరుపున రోడ్‌షోలు…
Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల విలువైన పోంజీ స్కీమ్ కేసులో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు పిలిచింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం.. నవంబర్ 20న తిరుచురాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెల్లర్స్‌కి చెందిన భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన ఆస్తులపై దర్యాప్తు సంస్థ సోదాలు అనుసరించి సమన్లు వచ్చాయి.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఆర్మీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజాపై హమాస్ ఉగ్రవాదులు నియంత్రణ కోల్పోయారని గాజా ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయిల్-హమాస్ సంధి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ దళాలు తాజా హెచ్చరికలు చేశాయి.
Uttarkashi tunnel collapse: ఉత్తరాఖండ్ సిల్క్యారా టన్నెల్ కుప్పకూలిన ఘటనలో అందులో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్య్కూ కార్యక్కరమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. విదేశీ నిపుణలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఇతర ఏజెన్సీలు గత 12 రోజులుగా వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వారి ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 52 మీటర్లు దూరంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు మరో 10 మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే సరిపోతుంది. వారిని విజయవంతంగా బయటకు తీసుకురావచ్చు. తాము మిమ్మల్ని రక్షించే పనుల్లో దగ్గరకు వచ్చామని కార్మికులకు…
Himanta Biswa Sarma: అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మ్యాచుకి హాజరుకావడం వల్లే భారత్ ఓడిపోయిందని, చెడుశకునం అంటూ రాహుల్ గాంధీ విమర్శించడం వివాదాస్పదమైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
Mamata Banerjee: బీజేపీకి బెంగాల్ సీఎం, తృణమూల్ సుప్రీమో మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన నలుగురిని కేంద్ర ఏజెన్సీలు అరెస్ట్ చేశాయని, రాష్ట్ర పోలీసులు ఇందుకు ప్రతిగా 8 మంది బీజేపీ నాయకులను జైలులో పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది. గత 24 గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ముగ్గురు సైనికులు మొత్తంగా ఐదుగురు వీరమరణం పొందారు. గురువారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరణించిన వారి ఫోటోలు పేర్లను ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
Benjamin Netanyahu: హమాస్ ఉగ్రవాదుల దాడిపై ఇజ్రాయిల్ రగిలిపోతోంది. పటిష్టమైన నిఘా వ్యవస్థ, మొసాద్ వంటి అగ్రశ్రేణి గూఢచార వ్యవస్థ ఉన్నప్పటికీ దాడుల్ని అడ్డుకోలేకపోయాయి. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు కేవలం 20 నిమిషాల్లోనే గాజా నుంచి 5 వేల రాకెట్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగించారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ బార్డర్ వద్ద నిఘా వ్యవస్థ కళ్లుగప్పి ఇజ్రాయిల్ పౌరుల్ని హతమార్చారు. ఈ ఊచకోతలో 1200 మంది చనిపోగా.. మరో 240 మందిని హమాస్ బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది.
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ చేసిన ‘పనౌటీ’(చెడు శకునం) వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రాహుల్ గాంధీకి నోటీసులు పంపింది.
Mahua Moitra row: మహువా మోయిత్రా వివాదం దేశం అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్యాష్ ఫర్ క్వేరీ కేసుగా పిలువబడుతున్న ఈ వివాదంలో ఇప్పటికే ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. మెజారిటీ ప్యానెల్ ఆమెను ఎంపీ పదవి నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసింది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు అభియోగాలు మోయిత్రాపై వచ్చాయి.