New Year 2026: ప్రపంచం అంతా న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. కొత్త ఏడాది 2026కు స్వాగతం పలిచేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా వెల్‌కమ్ చేశాయి. న్యూజిలాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. అక్లాండ్ బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. ప్రతీసారి కొత్త సంవత్సరం వేడుకలు న్యూజిలాండ్‌లో జరుగుతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే, అది నిజం కాదు, న్యూజిలాండ్ కన్నా ముందే పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటీ ద్వీప దేశానికి ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూ ఇయర్ వస్తుంది.
ఏయే దేశాల్లో ముందుగా న్యూఇయర్ వస్తుంది(భారత కాలమాన ప్రకారం)
కిరిబాటి: మధ్యాహ్నం 3:30 (డిసెంబర్ 31)
న్యూజిలాండ్: సాయంత్రం 4:30 (డిసెంబర్ 31)
ఆస్ట్రేలియా (తూర్పు తీరం): సాయంత్రం 6:30 (డిసెంబర్ 31)
జపాన్, దక్షిణ కొరియా & ఉత్తర కొరియా: రాత్రి 8:30 (డిసెంబర్ 31)
చైనా, హాంకాంగ్ & తైవాన్: రాత్రి 9:30 (డిసెంబర్ 31)
థాయ్‌లాండ్: రాత్రి 10:30 (డిసెంబర్ 31)
భారతదేశం & శ్రీలంక: రాత్రి 12:00 (అర్ధరాత్రి)
రష్యా (మాస్కో): తెల్లవారుజామున 2:30 (జనవరి 1)
ఉక్రెయిన్: తెల్లవారుజామున 3:30 (జనవరి 1)
జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ & స్విట్జర్లాండ్: తెల్లవారుజామున 4:30 (జనవరి 1)
యూకే, పోర్చుగల్ & ఘనా: తెల్లవారుజామున 5:30 (జనవరి 1)
బ్రెజిల్ & అర్జెంటీనా: ఉదయం 8:30 (జనవరి 1)
యుఎస్ (తూర్పు తీరం): ఉదయం 10:30 (జనవరి 1)
న్యూ ఇయర్‌ను చివరగా జరుపుకునే దేశాలు ఇవే:
UTC-12 జోన్‌లో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే చివరి ప్రదేశాలు అమెరికన్ సమోవా, బేకర్, హౌలాండ్ దీవులు. ఇక్కడ అర్ధరాత్రి కిరిబాటి కంటే దాదాపు ఒక పూర్తి రోజు తర్వాత వస్తుంది.