Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం, గిఫ్టులు తీసుకున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. దీంతో పాటు ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారని తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది.
Geert Wilders: మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నపూర్ శర్మ గతేడాది మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆమెను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ వ్యాఖ్యలు ఇటు ఇండియాలోనే కాకుండా ఖతార్, సౌదీ, యూఏఈ వంటి దేశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఇస్లామిక్ దేశాలు డిమాండ్ చేశాయి. ఇదే కాకుండా ఆమెను చంపేస్తామంటూ రాడికల్ ఇస్లామిస్టులు బెదిరింపులకు పాల్పడ్డారు. నుపూర్ శర్మకు మద్దతు తెలిపినందుకు రాజస్థాన్ రాష్ట్రంలో కన్హయ్య లాల్ అనే…
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర చేసిందని అమెరికా అధికారి ఆరోపించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నిన్న కథనాన్ని ప్రచురించింది. అయితే అమెరికా ఈ హత్య ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు తన కథనంలో పేర్కొంది. అయితే పన్నూను హత్య చేసే కుట్రలో ప్రమేయం ఉందని తెలియగానే భారత్ ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్‌హౌజ్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ అన్నారు. అయితే వాట్సన్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ.. ఇలాంటి వైఖరి తన విధానం…
Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌లో గత 24 గంటలుగా ఎన్కౌంటర్ జరుగుతోంది. రాజౌరి ప్రాంతంలో కలకోట్ అటవీ ప్రాంతంలో జరగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటికే నలుగురు ఆర్మీ జవాన్లు మరణించాగా.. గాయపడిన మరో సైనికుడు ఈ రోజు మరణించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌కి చెందిన కీలక లష్కరే తోయిబా ఉగ్రవాది భద్రతాబలగాలు హతమార్చాయి. మరణించిన పాక్ ఉగ్రవాదిని ఖారీగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇతను ప్రయత్నిస్తున్నాడు.
Uttarakhand tunnel rescue: ఉత్తరాఖండ్ టన్నెల్లో చిక్కుకుపోయిన 41 మంద కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. మరికొన్ని గంటల్లో వారంతా సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. సిల్క్యారా టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వచ్చిన వెంటలనే వారికి చికిత్స అందించేందుకు బుధవారం 41 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు.
Illegal Immigrant: అగ్రరాజ్యం అమెరికా వలసల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా ఏళ్లుగా అక్రమ వలసదారులు ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నారు. మెరుగైన అవకాశాలు, జీవనోపాధి పలు దేశాలను అమెరికా వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ అక్రమ వలసదారుల జాబితాలో భారతీయులు కూడా ఉన్నారు.
Delhi High Court: విడిపోయిన భార్యభర్తల నెలవారీ భరణానికి సంబంధించిన కేసును విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహేతుకమైన సంపాదించగల సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామి, తగిన వివరణ లేకుండా నిరుద్యోగిగా, పనిలేకుండా ఉండకూడదని, తన ఖర్చులను భర్త ఏకపక్షంగా భరించడానికి అనుమతించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఏ) కింద విడిపోయిన భార్యకు భర్త చెల్లించాల్సిన నెలవారీ భరణాన్ని రూ.30,000 నుంచి 21,000లకి తగ్గిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
PM Modi: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ... ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాది ప్రధాని నరేంద్రమోడీ మరోసారి నొక్కి చెప్పారు. బుధవారం జీ 20 సమ్మిట్ వర్చువల్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు జీ 20 సభ్య దేశాలతో కలిసి నడవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇజ్రాయిల్- హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు.
Volkswagen Taigun Sound Edition: జర్మనీ ఆటోమేకర్ వోక్స్వ్యాగన్ తన కార్లతో ఇండియన్ మార్కెట్లో మంచి స్థానాన్ని సంపాదించింది. ముఖ్యంగా వోక్స్వ్యాగన్ తన ఎస్యూవీ టైగున్తో మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న కాంపాక్ట్ XUVలో విభాగంలో గట్టి పోటీనిస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ సంపాదిస్తోంది.
PM Modi: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 25న జరగబోతున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన చేస్తున్నాయి. ఈ సారి అధికారమే ధ్యేయంగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి చేసిందని, తాము అధికారంలోకి వస్తే అన్నీ బయటకు తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.