Minister KTR: ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు జేబీఎస్ నుంచి తూంకుంట వరకు స్కై వేలు ఏర్పాటు చేయాలని చూస్తున్నామని, అయితే కేంద్ర మంత్రులను కలిసి రక్షణశాఖ భూములను ఇవ్వాలని కోరితే, అందుకు అంగీకరించలేదని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ఈ స్కైవేలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
No Non-veg Day: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రేపు అన్ని మాంసం దుకాణాలు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘నో నాన్ వెజ్’గా ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 25ని "నో నాన్ వెజ్ డే"గా ప్రకటించింది. మాంసం దుకాణాలు, కబేళాలను మూసేయాలని అధికార ప్రకటన తెలిపింది.
Putin: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూ తిరుగుతోంది. దీనిపై పట్టు సాధించేందుకు అనేక కంపెనీలు ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధినేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. AIపై వెస్ట్రన్ దేశాల గుత్తాధిపత్యం ఉండకూడదని ఆయన అన్నారు. AI అభివృద్ధికి మరింత ప్రతిష్టాత్మకమైన రష్యా వ్యూహానికి తర్వలో ఆమోదం లభిస్తుందని అన్నారు.
Israel-Hamas war: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత రెండు నెలలుగా బందీలుగా ఉన్నవారిలో 25 మందిని హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. విడుదలైన వారిలో 12 మంది థాయ్‌లాండ్ దేశస్తులు ఉన్నట్లు ఆ దేశ ప్రధాని స్ట్రెట్టా థావిసిస్ పేర్కొన్నారు. నాలుగు రోజలు కాల్పుల విరమణలో భాగంగా హమాస్, ఇజ్రాయిల్ సంధి ఒప్పందానికి వచ్చాయి. మరోవైపు జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయనుంది.
Gujarat: గుజరాత్ మోర్బీ జిల్లాలో దారుణంగా ప్రవర్తించింది ఓ యజమాని. తాను మహిళని మరిచిపోయి ఓ దళిత ఉద్యోగిపై కర్కషంగా వ్యవహరించింది. పెండింగ్‌లో ఉన్న జీతం ఇవ్వాలని అడిగినందుకు సదరు మహిళా యజమాని దళిత ఉద్యోగిపై దాడి చేయడమే కాకుండా.. ఆమె చెప్పులను నోటిలో పెట్టుకోవాలని హింసించింది. ఈ వ్యవహారంలో సదరు మహిళతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
L&T Technology Services: L&T టెక్నాలజీ సర్వీసెస్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మధ్యస్థాయి నుంచి సీనియర్ రోల్స్‌లో ఉన్న 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు రిపోర్ట్స్ వెలువడ్డాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ పెర్ఫామెన్స్ సైకిల్, ఉద్యోగుల ఓవర్ లాప్ కారణంగా పాక్షికంగా తన సిబ్బందిని తొలగించనుంది.
Harish Rao: కాంగ్రెస్ నేతల మాటలు, కాంగ్రెస్ హమీలపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మూడు గంటలు కరెంట్ చాలన్న ఆయన నిన్న నారాయణఖేడ్ వచ్చాడని, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇస్తామని, ఆ రాష్ట్ర ఓటర్లను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ఉన్న గోచి ఊడిపోయిందని అన్నారు.
Vivek: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు, 2004లో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. సీఎంకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 85 ప్లస్ ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని జోక్యం చెప్పారు. బీఆర్ఎస్ది అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు.
Supreme Court: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్‌ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి.
Indian Army: జమ్మూ కాశ్మీర్‌లోకి విదేశీ ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. రాజౌరీ ఎన్కౌంటర్లో మరణించిన ఐదుగురు ఆర్మీ అధికారులకు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. గత రెండు రోజులుగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరేతోయిబా టాప్ కమాండర్ కారీతో పాటు మరో ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి.