Pakistan: తాలిబాన్ల వేధింపుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వదిలి పాకిస్తాన్ దేశంలోకి శరణార్థులుగా వెళ్లిన వారి పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్తాన్, తమ దేశం విడిచివెళ్లాలని ఆఫ్ఘన్ శరణార్థులకు డెడ్‌లైన్ విధించింది. దేశవ్యాప్తంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించి శరణార్థులను గుర్తిస్తోంది. చాలా ఏళ్లుగా పాకిస్తాన్ లో స్థిరపడిన ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఇళ్లు, వ్యాపారం ఇలా అన్నింటిని వదిలేసి మళ్లీ ఆప్ఘనిస్తాన్ వెళ్తున్నారు.
గతేడాది ప్రపంచాన్ని కలవరపెట్టిన మంకీపాక్స్ మరోసారి విజృంభిస్తోంది. ఆఫ్రికా దేశం కాంగోలో వ్యాధి విస్తరించడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కాంగోలో విస్తరిస్తున్న మంకీపాక్స్ స్ట్రెయిన్ శక్తివంతమైందినగా ఉంది. డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని 26 ప్రావిన్సుల్లో 11 ప్రావిన్సుల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరగడంతో పాటు 22 ప్రావిన్సులకు వ్యాధి విస్తరించింది. ఆ దేశంలో 12,500 మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. జనవరి-నవంబర్ మధ్యలో 581 మంది వైరస్ మూలంగా చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.…
Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్ ప్లానెటరీ మిషన్, ఆదిత్య ఎల్1 సోలాల్ మిషన్ విజయవంతంగా నిర్దేశించిన మార్గంలో వెళ్తోంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ఆదిత్యఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక చివరి దశకు చేరుకుందని, L1 కక్ష్యలో ప్రవేశపెట్టే విన్యాసాలు జనవరి 7, 2024 నాటికి పూర్తవుతాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
Wife Kills Husband: భార్య పుట్టిన రోజు వివాదం భర్తకు చావుగా మారింది. తన పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్‌కి తీసుకెళ్లలేదని భార్య, భర్తను కొట్టి చంపింది. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. దుబాయ్ తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో భార్య, భర్త ముక్కుపై కొట్టింది. దీంతో 36 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పూణేలోని వానావ్డీ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియన్ సొసైటీలో శుక్రవారం ఈ దారుణం జరిగింది.
ఖతార్, ఈజిప్టు దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి కుదిరింది. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ అంగీకరించింది. దీంట్లో భాగంగా హమాస్ తన వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తోంది, మరోవైపు ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని డీల్ కుదిరింది.
Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఈ రోజు తీర్పు ప్రకటించింది. నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరీ కిందికి రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మహ్మద్ ప్రవక్తను అవమానించడనే ఆరోపణలో ఓ వ్యక్తి బస్సు కండక్టర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో పొడిచాడు. ప్రస్తుతం కండక్టర్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. 20 ఏళ్ల యువకుడికి, కండక్టర్‌కి బస్సు టికెట్ ఛార్జీపై వివాదం మొదలైంది. ఆ తర్వాత అతనిని పొడిచాడు. ప్రవక్త గురించి అవమానకరంగా మాట్లాడినందుకే కండక్టర్‌పై దాడి చేసినట్లు నిందితుడు ఓ వీడియోలో తన నేరాన్ని అంగీకరించాడు.
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేఎల్ఎఫ్) ఉగ్రసంస్థ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య తీవ్ర దౌత్యవివాదం ఏర్పడింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇంతే కాకుండా, భారత సీనియర్ రాయబారిని కెనడా నుంచి బహిష్కరించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ కూడా అంతే ధీటుగా కెనడా రాయబారి దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్‌సమంద్ జిల్లాలో ఘోరం జరిగింది. దాగుడు మూతలు ఆడుతూ ఇద్దరు బాలికలు మరణించారు. ఐస్ క్రీం ఫ్రీజన్‌లో చిక్కుకోవడంతో ఊపిరాడక మరణించారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఖమ్నేర్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
Monkeypox: గతేడాది ప్రపంచాన్ని కుదిపేసిన మంకీపాక్స్ వ్యాధి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆఫ్రికా దేశం డెమెక్రాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ లైంగికంగా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ దేశంలో అతిపెద్ద వ్యాప్తి నమోదైంది. ఈ దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. బెల్జియం దేశానికి చెందిన నివాసిమార్చిలో కాంగోకు వెళ్లారని, కొద్ది సేపటికే మంకీపాక్స్ పాజిటివ్ అని తేలిందని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది.