Vivek: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు, 2004లో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. సీఎంకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 85 ప్లస్ ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని జోక్యం చెప్పారు. బీఆర్ఎస్‌ది అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు.
Read Also: Himantha Biswa Sharma: వికారాబాద్ జిల్లా పరిగిలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రోడ్ షో..
భూస్వాములకు రైతుబంధు ఇవ్వడం ఎందుకని వివేక్ ప్రశ్నించారు. కౌలు రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు. డీఎంఎఫ్‌టీ ఫండ్స్ వేరే జిల్లాలకు తరలించుకుపోయారని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో ప్రజలను బాల్క సుమన్ ఒక్కసారి కూడా కలవలేదని అన్నారు. కేవలం లారీల లెక్క మాత్రమే చూసుకునిపోయారని ఇసుకదందా గురించి విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 20 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. కేసీఆర్ తుగ్లక్ ముఖ్యమంత్రి అని అన్నారు. ఈడీ సోదాలపై తప్పుడు ప్రకటన ఇచ్చిందని, నేను లీగల్ గా బిజినెస్ చేస్తున్నానని, దీనిపై లీగల్‌గా ఫైట్ చేస్తానన్నారు.
చెన్నూర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున వివేక్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరుపున బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. ఇరు పార్టీలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. బాల్క సుమన్ అవినీతికి పాల్పడ్డారని వివేక్ ఆరోపిస్తే, సూటికేస్‌లతో వచ్చేవారిని జనం నమ్మరని, అభివృద్ధి చేసిన వారికే ప్రజలు పట్టం కడుతారని సుమన్ చెబుతున్నారు.