L&T Technology: L&T టెక్నాలజీ సర్వీసెస్ ఉద్యోగులకు షాక్.. 200 మందికి లేఆఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
L&T Technology Services: L&T టెక్నాలజీ సర్వీసెస్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మధ్యస్థాయి నుంచి సీనియర్ రోల్స్‌లో ఉన్న 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు రిపోర్ట్స్ వెలువడ్డాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ పెర్ఫామెన్స్ సైకిల్, ఉద్యోగుల ఓవర్ లాప్ కారణంగా పాక్షికంగా తన సిబ్బందిని తొలగించనుంది.
L&T టెక్నాలజీ దాదాపుగా 24,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ప్రస్తుతం 200 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న కంపెనీ, ఆ తర్వాత వ్యాపార వాతావరణాన్ని అంచానా వేసి జనవరిలో మరో రౌండ్ ఉద్యోగుల కోత ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ‘‘ మేము ప్రతీ ఏడాది మా శ్రామిక శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి, నైపుణ్యం, పనితీరు ఆధారంగా తగిన విధంగా వ్యవహరించడానికి ఒక ప్రామాణిక వార్షిక పనితీరు సమీక్షిస్తాము. మా ఉన్నత ప్రమాణాల సేవల్ని, స్కిల్స్‌ని పెంచుకోవడం సంస్థకు కీలకం. సంస్థ, మేము సాంకేతిక ఆవిష్కరణల్లో ముందంజలో ఉన్నామని నిర్థారిస్తూ.. మా వృద్ధి అవకాశాలకు, వ్యూహాలకు అనుగుణంగా ప్లాంట్ ఇంజనీరింగ్, డిజిటల్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఏఐ విభాగాల్లో నియామకాలను జోడిస్తాం.’’ అని L&T ప్రతినిధి చెప్పారు.
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Read Also: CPI Narayana: కూతురును కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో కలిశాడు
గత నెలలో L&T టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 5 శాతం పెరిగి రూ. 315.4 కోట్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధిని తగ్గించింది.
గతేడాదిగా పలు కంపెనీల్లో మొదలైన లేఆఫ్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెక్ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగుల్ని తొలగించాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనానికి తోడు ఏఐ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉద్యోగులకు కోతలు విధించాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!