PM Modi: కొన్ని పెద్ద కుటుంబాలు డెస్టినేషన్ వెడ్డింగ్ పేరులో విదేశాల్లో వివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అయితే దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని కుటుంబాలు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్న తీరు తనను కలవరపరుస్తోందని, దేశానికి చెందిన ధనం వేరే దేశానికి చేరకుండా భారత గడ్డపై ఇలాంటి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కోరారు. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేటప్పుడు, ప్రజలు భారతీయ ఉత్పత్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని…
China Pneumonia: చైనాలో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో భారత్‌లో వ్యాధి తీవ్రత ఉండదని చెప్పింది. పొరుగు దేశంలో పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు.
Man Kills Wife: ఫ్రైడ్ చికెన్ కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఫ్రైడ్ చికెన్ కొనడానికి నగదు ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓ టైలర్ తన భార్యను కత్తెరతో గొంతుకోసి హత్య చేశాడు. ఘజియాబాద్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో శనివారం ఈ హత్య జరిగింది. షాహిద్ హుస్సేనే అతని భార్య నూర్ బానో(46)ని హత్య చేశాడని ఏసీపీ సిద్ధార్థ గౌతమ్ తెలిపారు. దంపతుల పిల్లల ముందే ఈ హత్య జరిగింది. భార్యను హత్య…
Stampede: కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ(CUSAT)లో శనివారం జరిగిన మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 64 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ పాల్గొన్న ఈ కార్యక్రమం యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది.
Elon Musk: వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య చర్చలు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది నుంచి భారత్ లోకి టెస్లా కార్లు దిగమతి కానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు టెస్లా సిద్ధమైంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లోని ఏదో చోట ప్లాంట్ నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి సంబంధించి ఎకో…
Iran:ఇస్లామిక్, షరియా చట్టాలను పాటించే అరబ్ దేశాల్లో నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. అత్యాచారం, డ్రగ్స్ వినియోగం, హత్య వంటి నేరాలకు ఉరిశిక్ష విధిస్తుంటారు. తాజాగా ఓ 17 ఏళ్ల యువకుడికి ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది. మైనర్ చేసిన నేరానికి ఉరిశిక్ష విధించడాన్ని హక్కుల సంఘాలు శనివారం తీవ్రంగా ఖండించారు. ఓ ఘర్షణలో మరో వ్యక్తిని హత్య చేసింనందుకు మైనర్కి మరణశిక్ష విధించింది.
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ దారుణానికి ఒడిగట్టింది. ఇజ్రాయిల్ సైనికులకు సహకరించారనే నెపంతో ముగ్గురు పాలస్తీనా పౌరుల్ని బహిరంగంగా ఉరి తీశారు. ఇజ్రాయిల్‌కి సహకరించినందుకు వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. తుల్కర్మ్‌లో రెండు మృతదేహాలను విద్యుత్ స్తంభానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
PM Modi security breach: పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఉల్లంఘన గతేడాది చర్చనీయాంశంగా మారింది. అత్యంత రక్షణ ఉండే ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌పై ఆందోళనకారులు నిలిపేశారు. పంజాబ్ పోలీస్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భద్రతా ఉల్లంఘన జరిగనట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జనవరి 5, 2022 రోజున పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ పర్యటనకు మోడీ వెళ్లిన క్రమంలో, రైతులు ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుంది టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వారితో పంచుకున్నట్లు వెల్లడైంది. దీనిపై ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలతోఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Tinder Date: టిండర్‌లో పరిచయం చివరకు హత్యకు దారి తీసింది. అబద్ధాలపై ఏర్పడిన ఇద్దరి మధ్య బంధం హత్యకు పురిగొల్పాయి. ప్రేయసిగా నటించి ఓ వ్యక్తిని చంపిన సంఘటన 2018లో జైపూర్‌లో జరిగింది. 28 ఏళ్ల దుష్యంత్ శర్మ, 27 ఏళ్ల ప్రియాసేథ్ అనే అమ్మాయితో టిండర్‌లో పరిచయమైంది. ఇద్దరి అభిరుచులు కలవడంతో మూడు నెలల పాటు మాట్లాడుకున్నారు. ఇద్దరూ వ్యక్తిగతంగా కలవాలనుకున్నారు. ప్రియాసేథ్ తన ఇంటికి ఆహ్వానించడంతో వెనకాముందు ఆలోచించకుండా దుష్యంత్ అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక తెలిసింది, తను కిడ్నాప్ అయ్యానని,…