Supreme Court: అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా మీ దగ్గర ఏ ఆధారం ఉంది..? హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్‌ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి.
ఈ వ్యవహారంలో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జార్జ్ సోరోస్ ఫండెడ్ గ్రూప్ ఇచ్చిన నివేదికతో ముడిపడి ఉన్న కేసులో పిటిషనర్లను ఘాటుగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ‘‘మేము విదేశీ నివేదికను ఎందుకు నిజం చేయాలి..? మేము నివేదికను తిరస్కరించడం లేదు, కానీ మాకు రుజువులు కావాలి. మీ దగ్గర అదానీ గ్రూపుకు వ్యతిరేకం ఏం ఆధారాలు ఉన్నాయి..?’’ అని భారత ప్రధానన్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశాంత్ భూషన్‌ని ప్రశ్నించారు.
Also Read
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(OCCRP), ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పుతోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని తప్పుపట్టింది. మెరిట్ లెస్ హిండెన్‌బర్గ్ నివేదికను పునరుద్ధరించడానికి జార్జ్ సోరోస్ నిధులతో నడిచే విదేశీ మీడియా విభాగం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆరోపించింది.
Read Also: Indian Army: జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్ రిటైర్డ్ సైనికులు..
సెబీ కూడా ఈ నివేదిక నమ్మదగినదిగా లేదని తోసిపుచ్చింది. ‘‘ ఇలాంటి నివేదికపై స్పందిస్తే, మన ఏజెన్సీలే ఏమి చేయాలి..? విదేశీ నివేదికల ద్వారా భారతీయ విధానాలనున ప్రభావితం చేసే ట్రెండ్ నడుస్తోంది’’ అని సెబీ తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
హిండెన్‌బర్గ్ నివేదిక రావడానికి ముందు మరియు తర్వాత ఏదైనా ఉల్లంఘన జరిగిందా అనే దానిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేస్తోంది. అనుమానిత లావాదేవీలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసులను సెబీ పూర్తి చేసిందని, మిగిలిన రెండింటి కోసం విదేశాల్లోని ఏజెన్సీల సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని మెహతా చెప్పారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..