Putin: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూ తిరుగుతోంది. దీనిపై పట్టు సాధించేందుకు అనేక కంపెనీలు ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధినేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. AIపై వెస్ట్రన్ దేశాల గుత్తాధిపత్యం ఉండకూడదని ఆయన అన్నారు. AI అభివృద్ధికి మరింత ప్రతిష్టాత్మకమైన రష్యా వ్యూహానికి తర్వలో ఆమోదం లభిస్తుందని అన్నారు.
Read Also: Israel-Hamas war: 25 మంది బందీలను రిలీజ్ చేసిన హమాస్..
చైనా, అమెరికా ఏఐ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. అయితే రష్యా కూడా AI శక్తిగా ఉండాలని అనుకుంటోంది. మాస్కోలో జరిగిన AI కాన్ఫరెన్స్‌లో పుతిన్ మాట్లాడుతూ.. ఏఐని నిషేధించడానికి ప్రయత్నించడం అసాధ్యమని, ఏఐ సాంకేతికతలో పాశ్చాత్య దేశాల గుత్తాధిపత్యం పొందేందుకు అనుమతించడం ప్రమాదకరమని, ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. త్వరలోనే ఏఐ అభివృద్ధికి కొత్త జాతీయ వ్యూహాన్ని ఆమోదిస్తామని అన్నారు. కొన్ని పాశ్చాత్య సెర్చ్ ఇంజన్లు రష్యా సంస్కృతిని రద్దు చేస్తున్నాయని ఆయన అన్నారు. AI అభివృద్ధిని ప్రోత్సహించడానికి రష్యా చట్టబద్ధమైన మరియు పెట్టుబడి మార్పులను చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
20వ శాతాబ్ధంలో ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తుందని టెక్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ రేసులో రష్యా కూడా కీలక ప్లేయర్‌గా ఉండాలనుకుంటుంది. అయితే ఉక్రెయిన్ యుద్ధం రష్యాను రేసులో వెనబడేలా చేశాయి. యుద్ధ ఫలితంగా ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు రష్యాను విడిచిపెట్టారు. మరోవైపు రష్యాపై వెస్ట్రన్ దేశాల ఆంక్షలు ఇబ్బందికరంగా మారాయి.