Israel-Hamas War: రెండో విడతగా 14 మంది బందీలను విడుదల చేయనున్న హమాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందంలో భాగంగా ఇరు వర్గాలు తమ వద్ద ఉన్న బందీలను మార్చుకుంటున్నాయి. అక్టోబర్ 7న హమాస్ అపహరించుకుని బందీలుగా తీసుకెళ్లిన వారిలో కొంతమందిని శుక్రవారం నుంచి విడుదల చేయడం ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది. శుక్రవారం రోజున 24 మందిని హమాస్ మొదటి విడతగా విడుదల చేయగా.. శనివారం మరో 14 మందిని రెండో విడతలో హమాస్ విడుదల చేయనుంది. వీరిని ఇజ్రాయిల్‌కి అప్పగించాలని హమాస్ భావిస్తోంది. దీనికి బదులుగా 42 మంది ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయనుంది. శుక్రవారం విడుదల చేసిన వారిలో 13 మంది ఇజ్రాయిలీలతో సహా థాయ్‌లాండ్ దేశస్తులు కూడా ఉన్నారు. మొత్తంగా తొలి విడతలో 24 మంది బందీలు హమాస్ చెర నుంచి విముక్తులయ్యారు.
Read Also: Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు విధించిన కోర్టు..
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఖతార్, ఈజిప్టు దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి కుదిరింది. నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ అంగీకరించింది. దీంట్లో భాగంగా హమాస్ తన వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తోంది, మరోవైపు ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని డీల్ కుదిరింది.
హమాస్ మొత్తం 50 మంది బందీలను విడుదల చేస్తామని చెప్పింది. మిగిలిన వారిని ఆది, సోమవారాల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 7 రోజున ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1200 మందిని చంపడమే కాకుండా.. 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. హమాస్ చేతిలో ఉన్న 200 మందికి పైగా బందీలను విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!