Monkeypox: గతేడాది ప్రపంచాన్ని కలవరపెట్టిన మంకీపాక్స్ మరోసారి విజృంభిస్తోంది. ఆఫ్రికా దేశం కాంగోలో వ్యాధి విస్తరించడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కాంగోలో విస్తరిస్తున్న మంకీపాక్స్ స్ట్రెయిన్ శక్తివంతమైందినగా ఉంది. డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని 26 ప్రావిన్సుల్లో 11 ప్రావిన్సుల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో కేసుల సంఖ్య పెరగడంతో పాటు 22 ప్రావిన్సులకు వ్యాధి విస్తరించింది. ఆ దేశంలో 12,500 మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. జనవరి-నవంబర్ మధ్యలో 581 మంది వైరస్ మూలంగా చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. 1970లో తొలిసారిగా మంకీపాక్స్ మానవుడి నుంచి మానవుడికి సంక్రమించింది. అప్పటి నుంచి పోలిస్తే ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
Read Also: Tillu Square: రాధిక ..రాధిక.. రాధిక అంటూ జపం చేస్తున్న టిల్లుగాడు
గతేడాది ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికాలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీన్ని ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయితే క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది మేలో ఎమర్జెన్సీని ముగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం కాంగోలో విస్తరిస్తున్న వ్యాధి మరోసారి ప్రపంచాన్ని రిస్కులోకి నెట్టింది.
స్వలింగ సంపర్కం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జ్వరం, ఒంటిపై దద్దుర్లు, శరీర నొప్పులు వ్యాధి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. దీనికి ప్రస్తుతం ఎలాంటి టీకా లేదు. అయితే ఈ వ్యాధిని మన రోగ నిరోధక శక్తి సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. కొన్ని రోజుల్లోనే వ్యాధి నుంచి బాధితులు బయటపడొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది ప్రాణాంతకంగా మారుతోంది.