Revanth Reddy: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర ఆక్రమించిన భూములు ఉండొచ్చు, అక్రమ సంపాదన ఉండొచ్చు కానీ ప్రజా మద్దతు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌కి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో పటాన్చెరులో బీఆర్ఎస్ నేతల రౌడీయిజం, వాళ్ల ఆగడాలు మీకు తెలుసని, మీరు ఓటేసి గెలిపిస్తే మీ భూముల్ని గుంజుకున్నరు, వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు…
CM KCR: ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి ఎదిగానంటే దుబ్బాక పెట్టిన భిక్ష అని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన కోసం పుట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం దుబ్బాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాకలోనే తాను చదువుకున్నట్లు చెప్పారు. ఉన్న తెలంగాణను ఊగగొట్టంది కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. 2001లో గులాబీ జెండా ఎగిరితే, 2004లో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకుందని చెప్పారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రపోజ్ చేస్తే ఒప్పుకోలేదని మహిళను ఓ వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. కాన్పూర్‌లోని రాణా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 26 ఏళ్ల వ్యక్తి తన పొరుగును ఉండే మహిళను నరికి చంపి, ఆ తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం(MDMK) ప్రధాన కార్యదర్శి వైకో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్ మరణించడాని ప్రకటించిన 14 ఏళ్ల తరువాత ఆయన ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ప్రభాకరన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు.
Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగం కూలిపోవడంతో గత 15 రోజులగా 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు దేశంలోని నిపుణులతో సహా అంతర్జాతీయ టన్నెల్ నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇటీవల అమెరికా నుంచి తీసుకువచ్చిన ఆగర్ మిషన్ సాయంతో రెస్క్యూ పనులు త్వరలోనే ముగుస్తాయని, కార్మికులంతా బయటపడతారని అంతా భావించారు. 57 మీటర్ల దూరంలో ఉన్న వారిని రక్షించేందుకు 47 మీటర్ల వరకు స్టీల్ పైపుల్ని అమర్చారు. అయితే మిషన్ విరిగి పోవడంతో ఈ ప్రయత్నాలను విరమించారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కాంగ్రెస్ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓవైసీ, ప్రధాని నరేంద్రమోడీకి స్నేహితుడని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓవైసీ స్పందించారు. రాహుల్ గాంధీ జీవితంలో రెండు ప్రేమలు ఉన్నాయని, ఒకటి ఇటలీ అయితే మరొకరు ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
Ship Sink: 14 మంది వ్యక్తులతో వెళ్తున్న కార్గో షిప్ గ్రీస్ సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. లెస్బోస్ ద్వీపం సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు గ్రీక్ కోస్ట్ గార్డ్స్ తెలిపారు. బలమైన ఈదురుగాలుల కారణంగానే షిప్ మునిగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం 14 మంది సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం ఐదు కార్గో షిప్‌లు, మూడు తీర రక్షక నౌకలు, వైమానిక దళం మరియు నేవీ హెలికాప్టర్లతో పాటు నేవీ ఫ్రిగేట్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
Myanmar: భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశంలో హింస చెలరేగింది. జుంటా పాలకకు వ్యతిరేకంగా అక్కడ సాయుధ గ్రూపులు పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సైనిక పాలకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు సైనికులు కంట్రోల్లో ఉన్న చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మూడు సాయుధ మైనారిటీ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఉన్న ఈ చైనా సరిహద్దు చాలా కీలకం. ప్రస్తుతం ఆ రాష్ట్రం…
China: చైనాలో మిస్టరీ వ్యాధి విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పిల్లలు శ్వాసకోశ జబ్బుల బారిన పడుతున్నారు. అయితే అనేక వ్యాధికారకాలు దేశంలో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని చైనా ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఈ వ్యాధులకు నోవల్ వైరస్ కారణంగా ఉండవచ్చని పేర్కొంది.
26/11 ముంబై దాడులు భారత దేశం ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడి. పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రం మార్గాన ముంబై మహానగరంలోకి వచ్చి మారణహోమాన్ని సృష్టించారు. ఈ ఘటనకు నేటితో 15 ఏళ్లు నిండాయి. అయితే ఆ నెత్తుటి గుర్తులు ఇప్పటికీ దేశ ప్రజలను బాధిస్తున్నాయి. నరేంద్రమోడీ ఈ రోజు తన 107వ ఎడిషన్ మన్ కీ బాత్‌లో ముంబై ఉగ్రదాడిని ‘ అత్యంత భయంకరమైన ఉగ్రదాడి’ గా పేర్కొన్నారు. ‘‘ ఈ రోజు నవంబర్ 26, ఈ రోజును ఎప్పటికీ మరిచిపోలేము. ఈరోజునే దేశంలో భయంకరమైన…