కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులు ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్-1898 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో అమలులోకి రానున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన బిల్లులు వలస రాజ్యాల కాలం నాటి చట్టాలను ముగింపు పలుకుతాయని ప్రధాని అన్నారు.
Bharat Jodo Yatra 2.0: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు మరోసారి భారత్ జోడో యాత్ర నిర్వహించాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ కోరింది. గతేడాది సెప్టెంబర్ నెలలో మొదలైన భారత్ జోడో యాత్ర తమిళనాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగింది. ఈ సారి భారత్ జోడో యాత్రం 2.0 తూర్పు నుంచి పడమర వరకు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు మరోసారి యాత్ర నిర్వహించాలని తామంతా రాహుల్ గాంధీని అభ్యర్థించామని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్…
Czech Republic: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రేగ్ నగరంలోని ఓ యూనివర్సిటీల్లో దుండగుడు సామూహిక కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య, వివరాలను చెక్ పోలీసులు ప్రకటించలేదు.
కులగణనను సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలని మా అభిప్రాయమని, ఈ కసరత్తు చేస్తున్న సమయంలో సామాజిక సామరస్యం, ఐక్యత దెబ్బతినకుండా చూసుకోవాలని, ఆర్ఎస్ఎస్ కూడా హిందూ సమాజం కోసం పనిచేస్తుందని ఈ రోజు ప్రకటనలో వెల్లడించింది.
Cold medicines: 4 ఏళ్లలోపు పిల్లలకు పిల్లలకు ఫిక్సుడ్ డ్రగ్ కాంబినేషన్(FDC) జలుబు మందులు వాడటాన్ని కేంద్రం నిషేధించింది. ఈ యాంటీ కోల్డ్ మందుల్లో క్లోర్ఫెనిరమైన్ మెలేట్ మరియు ఫినైల్ఫ్రైన్ అనే రెండు డ్రగ్స్ ఉంటున్నాయి. క్లోర్ఫెనిరమైన్ మలేట్ అనేది యాంటీ-అలెర్జీ (యాంటీహిస్టామైన్) డ్రగ్, ఇది ముక్కు కారడాన్ని, కళ్ల నుంచి నీరు కారడం, తుమ్ముల వంటి అలెర్జీ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఫినైల్ఫ్రైన్ అనేది రక్తనాళాల్లో అవరోధాలను తగ్గించి, ముక్కు మూసుకుపోవడం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రోజు ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడికి పాల్పడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో దాడి ఇది. దాడి జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలు పంపినట్లు సమాచారం. కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. పూంచ్‌లోని సురన్కోట ప్రాంతంలోని డేరా కీ గలీ(డీకేజీ) ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న నవాజ్, నాలుగోసారి పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని అనుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా యూకేలో ప్రవాసంలో ఉన్న నవాజ్ షరీఫ్ ఇటీవలే పాకిస్తాన్ తిరితగి వచ్చారు. తన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) తరుపున ప్రచారం చేస్తున్నారు.
Black Tigers: భారతదేశంలో మొత్తం 10 నల్ల పులులు ఉన్నాయని, అన్నీ కూడా ఒడిశాలోని సిమిలిపాల్ లోనే ఉన్నట్లు ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కి తెలిపింది. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో మాత్రమే ‘‘మెలనిస్టిక్స్ టైగర్స్’’(బ్లాక్ టైగర్స్)ని నమోదు చేశామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభకు తెలిపారు.
Sunspot: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్లో చివరి దశలకు చేరుకున్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలం క్రమంగా అలజడిగా మారుతోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం సన్‌స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలు ఎక్కువ అవుతున్నాయి. సూర్యుడిపై ఏర్పడే భారీ పేలుళ్ల కారణంగా పదార్థం అంతరిక్షంలోకి వెదజల్లబడుతోంది. దీని కారణంగా భూమిపై సౌరతుఫానులకు ఏర్పడుతున్నాయి.
WFI: మహిళా రెజ్లర్లపై, మైనర్లపై లైంగిక దాడి చేశాడని మాజీ రెజ్లింగ్ ఫెడరేషర్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా పలువురు రెజ్లర్లు పెద్ద ఉద్యమమే చేశారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ తాజా ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బ్రిజ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ విజయం సాధించారు.