PM Modi: మూడు నేర, న్యాయ బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. భారత చరిత్రలోనే అనేక వలస రాజ్యాల నాటి చట్టాల స్థానంలో కొత్తగా మూడు నేర-న్యాయ బిల్లులు ఆమోదం పొందాయని, ప్రజాసేవపై కేంద్రీకృతమైన చట్టాలతో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని మోడీ అన్నారు. భారతీయ న్యాయ సంహిత-2023, భారత నాగరిక్ సురక్ష-2023, భారతీయ సాక్ష్యా అధినియమ్-2023 బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత.. బ్రిటీష్ వారి దేశద్రోహంపై కాలం చెల్లిన సెక్షన్లకు వీడ్కోలు తెలిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో చెప్పారు.
కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లులు ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్-1898 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో అమలులోకి రానున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన బిల్లులు వలస రాజ్యాల కాలం నాటి చట్టాలను ముగింపు పలుకుతాయని ప్రధాని అన్నారు.
Read Also: Czech Republic: ప్రేగ్ యూనివర్సిటీలో దుండగుడి కాల్పులు.. పలువురి మృతి..
‘‘ఈ బిల్లుల సంస్కరణలు భారతదేశం నిబద్ధతకు నిదర్శనం. సాంకేతికత, ఫోరెన్సిక్ సైన్స్‌పై దృష్టి సారించి మన చట్టపరమైన, పోలీసింగ్, పరిశోధనాత్మక వ్యవస్థలను ఆధునిక యుగంలోకి తీసుకువస్తాయి. ఈ బిల్లులు పేదలకు, అట్టడుగున ఉన్న వారికి మెరుగైన రక్షణ అందిస్తాయి. ఈ బిల్లులు వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాయి. దేశ శాంతికి ఉపయోగకరం’’ అని ప్రధాని వెల్లడించారు.
The passage of Bharatiya Nagarik Suraksha Sanhita, 2023, Bharatiya Nyaya Sanhita, 2023 and Bharatiya Sakshya Adhiniyam, 2023 is a watershed moment in our history. These Bills mark the end of colonial-era laws. A new era begins with laws centered on public service and welfare.
— Narendra Modi (@narendramodi) December 21, 2023