Sunspot: భూమికి ఎదురుగా సూర్యుడిపై భారీ సన్‌స్పాట్.. భూమి కన్నా రెండింతలు పెద్దది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunspot: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలకు చేరుకున్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలం క్రమంగా అలజడిగా మారుతోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం సన్‌స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలు ఎక్కువ అవుతున్నాయి. సూర్యుడిపై ఏర్పడే భారీ పేలుళ్ల కారణంగా పదార్థం అంతరిక్షంలోకి వెదజల్లబడుతోంది. దీని కారణంగా భూమిపై సౌరతుఫానులకు ఏర్పడుతున్నాయి.
తాజాగా భూమికి ఎదురుగా సూర్యుడి ఉపరితలంపై భారీ సన్‌స్పాట్స్ ఏర్పడ్డాయి. దీంట్లో ప్రతీ ఒక్కడి భూమి కన్నా రెండు రెట్లు పెద్దదిగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం 48 గంటల్లోనే ఈ సన్‌స్పాట్ల పరిమాణం నాలుగు రెట్లు పెరిగిందని నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) వీడియోలో తెలుస్తోంది. పేలుడు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Also Read
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
Read Also: Salaar Vs Dunki : ప్రభాస్ ఫ్యాన్స్ పై షారుఖ్ ఫ్యాన్స్ దాడి?
AR3529 అని పిలువబడుతున్న ఈ సన్‌స్పాట్స్ అస్థిర ‘డెల్లా-క్లాస్’ అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో నెగిటివ్, పాజిటివ్ అయస్కాంత ధ్రువణాలు అస్థిరం వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది అత్యంత తీవ్రమైన సౌరజ్వాలలను ప్రేరేపిస్తుంది. ఈ సౌరజ్వాలలు భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. జీపీఎస్ నావిగేషన్‌ని ప్రభావితం చేస్తుంది, పవర్ గ్రిడ్ వైఫల్యాలు తలెత్తవచ్చు.
అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ఛార్జుడ్ పార్టికల్స్‌ని అడ్డుకుని, భూమిపై జీవజాలానికి ఎలాంటి ఆపద లేకుండా రక్షిస్తుంది. ఈ సౌరజ్వాలలు భూమిపై భూ అయస్కాంత తుఫానులను సృష్టిస్తుంది. వీటి వల్ల ధృవాల వల్ల ఆరోరాలు అని పిలువబడే కాంతి కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!