Drone Strike: హిందూ మహా సముద్రంలోని ఓ వ్యాపార నౌకపై డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లైబీరియా జెండాతో ఉన్న ట్యాంకర్ ఇజ్రాయిల్ అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకల్ని లేకపోతే ఇజ్రాయిల్ అనుబంధంగా పనిచేస్తున్న నౌకల్ని యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తున్నారు. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతుగా ఇరాన్ వ్యవహరిస్తోందని అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి.
Brij Bhushan Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం దేశంలో చర్చనీయాంశంగా మారింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి సన్నిహితుడైన వ్యక్తి సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా గెలుపొందడాన్ని రెజ్లర్లు తప్పుబడుతున్నారు. ఆయన గెలుపుపై నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత రెజ్లర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్‌కి గుడ్ బై చెప్పింది. బజరంగ్ పునియా తన పద్మశ్రీని ప్రధాని మోడీకి తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.
USA: అమెరికాలో మరోసారి ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. హిందూ ఆలయాన్ని టార్గెట్ చేసి దాడి చేశారు. కాలిఫోర్నియాలో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన నెవార్క్ నగరంలో చోటు చేసుకుంది. స్వామినారణయ మందిర గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు. ఆలయ గోడలపై ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు చిత్రీకరించారు.
Hijab ban row: కర్ణాటకలో మరోసారి హిజాబ్ వివాదం రాజుకుంది. బీజేపీ హయాంలో పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకే దుస్తులు ధరించాలని, హిబాబ్‌పై బ్యాన్ విధించింది. దీనిపై కర్ణాటక హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయగా.. కోర్టు కూడా హిజాబ్ అనేది ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి ఆచారం కాదని, విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, హిజాబ్ బ్యాన్‌ని ఎత్తేసింది.
France: 300 మందికి పైగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఆదేశంలో నిలిపేసినట్లు శుక్రవారం తెలిపారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న విమానం ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో విమానాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రహస్య సమాచారం రావడంతో ఈ విమానాన్ని అధికారులు అడ్డుకున్నారు. యూఏఈ నుంచి ఈ విమానం బయలుదేరింది. దక్షిణ అమెరికాలోని నికరాగ్వాకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
Hijab: గతేడాది కర్ణాటకలో హిజాబ్ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయ విమర్శలకు దారి తీసింది. పాఠశాల్లలో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై అప్పటి బీజేపీ సర్కార్ నిషేధం విధించింది. ఇదే అంశాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది.
Ivanka Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇజ్రాయిల్‌ని సందర్శించనున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో బాధితులను ఇవాంకా ట్రంప్ కలుసుకున్నారు. భర్త జారెడ్ కుష్నర్తో కలిసి బాధితులను పరామర్శించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్‌ని జనవరి 3న తమ ముందు హాజరుకావాలని కోరింది.
Resignation: రూ. 19 కోట్ల కంపెనీకి ఆయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ), అయితే ప్రస్తుతం ఆయన చేసిన రాజీనామా మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మామూలుగా రాజీనామాను మెయిల్ ద్వారా తన పైస్థాయి అధికారులకు పంపిస్తుంటారు. అయితే ఇతను మాత్రం తన రాజీనామా లేఖను పిల్లలు రాసుకునే స్కూల్ బుక్ పేజీపై తన సొంతంగా చేతితో రాసిన రాజీనామా లేఖను ఎండీకి పంపాడు.
JN.1 Corona variant: దేశంలో కొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కొత్త వేరియంట్ కేసులు 22 నమోదయ్యాయి. ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లోనే వెలుగులోకి వచ్చాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు నమోదైంది. అయితే JN.1 సోకిన వారంతా ఎలాంటి సమస్యలే లేకుండా కోలుకోవడం ఒకింత సంతోషకరమైన విషయం.