Man Bites Wife's Nose: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి భార్యను కట్నం కోసం గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కట్నం తీసుకురావాలని భార్య ముక్కును కొరికి తీవ్రంగా గాయపడిచారు. మహేష్ పూర్‌కి చెందిన అజ్మీ(22) తన భర్త కుటుంబానికి చెందిన ఆరుగురిపై సీబీ గంజ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది.
INDIA bloc: జేడీయూ ఎంపీ సునీల్ కుమార్ పింటూ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సమోసాలు ఏర్పాటు చేయడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. ఢిల్లీ వేదికగా నిన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. అయితే ఇంతకముందు కూటమి సమావేశాల్లో టీ, సమోసాలు ఉండేవని, అయితే నాలుగో సమావేశంలో మాత్రం టీ, బిస్కట్లకే పరిమితమైందని పింటూ అన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని శతాబ్ధాలుగా రాళ్లను దేవతలుగా పూజిస్తుlన్నారు. అక్కడి ప్రధాన సంప్రదాయాల్లో ఈ రాళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే తాజాగా తేలింది ఏంటంటే.. అసలు ఇవి రాళ్లే కావని, డైనోసార్లకు సంబంధించిన గుడ్లుగా తేలింది. అక్కడి ప్రజలు వీటిని తమ కుటుంబ దేవతలుగా కొన్నేళ్లుగా పూజిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Iran: ఇస్లామిక్ రాజ్యం ఇరాన్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలుసు. అక్కడ కంటికి కన్ను అనే రీతిలో శిక్షలు ఉంటాయి. షరియా చట్టాన్ని పాటించే ఇరాన్లో ఏ దేశంలో లేనట్టుగా ఉరిశిక్షలను విధిస్తోంది. మైనర్లు, మేజర్లు అనే తేడా లేకుండా తప్పు ఎవరు చూసినా.. ఉరిశిక్షే గతి.
Nawaz Sharif: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. అప్పుకోసం ప్రపంచదేశాలను, ఐఎంఎఫ్ చుట్టూ తిరుగుతోంది. ద్రవ్యోల్భణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు విద్యుత్, గ్యాస్, ఇంధన రేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో వచ్చ ఏడాది పాకిస్తాన్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణలతో ఇప్పటికే జైలులో ఉండగా.. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.
PM Modi: లోక్‌సభ ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి, ప్రధాని మోడీని గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే భారీ ప్లాన్‌తో కూటమి కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీనే టార్గెట్‌గా వారణాసిలో ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రముఖుల్ని బరిలో దించేందుకు కూటమి భావిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Lalu Yadav: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు ప్రస్తుత బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ స్కామ్‌లో లాలూ కుటుంబం నిందితులుగా ఉంది. తేజస్వీ యాదవ్‌కి శుక్రవారం ఈడీ సమన్లు అందగా.. డిసెంబర్ 27న ఏజెన్సీ ముందు హాజరు కావాలని లాలూని ఈడీ కోరింది
New criminal laws: కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లులను ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. ఇకపై మూకదాడికి పాల్పడిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉందని చెప్పారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.
Pakistan: పాకిస్తాన్ దేశంలో వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఉగ్రవాదిని పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపేసి అంతే వేగంతో మాయమవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు భారత వ్యతిరేక ఉగ్రవాదులు 19 మంది ఇలాగే చనిపోయారు. ఆదివారం రోజు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన కీలక ఉగ్రవాది హబీబుల్లాని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో కాల్చి చంపారు.
CM Nitish Kumar: ఇటీవల కాలంలో హిందీ భాష వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు నాయకులు ఈ వివాదాన్ని రేకెత్తిస్తున్నారు. అధికార డీఎంకే పార్టీ నాయకులు హిందీ భాషను తమపై రుద్దొద్దంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల గోవాల ఎయిర్ పోర్టులో ఓ తమిళ మహిళకి హిందీ రాకపోవడంపై అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అవహేనగా మాట్లాడారంటూ.. ఏకంగా సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.