Jammu Kashmir: పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. ముగ్గురు జవాన్లు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రోజు ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడికి పాల్పడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో దాడి ఇది. దాడి జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలు పంపినట్లు సమాచారం. కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. పూంచ్‌లోని సురన్‌కోట ప్రాంతంలోని డేరా కీ గలీ(డీకేజీ) ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు.
ఈ రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. రెండు ఆర్మీ వాహనాలపై దాడి జరిగింది. బుధవారం రాత్రి నుంచే ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం ఆర్మీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Read Also: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వొద్దు.. డీసీపీ వచ్చి బ్రతిమలాడినా వినలేదు!
బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సాయుధ పోలీసు యూనిట్ కాంపౌండ్‌లో పేలుడు సంభవించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. గత నెలలో రాజౌరీ లోని కలాకోట్ ప్రాంతంలో సైన్యానికి, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లతో పాటు పలువురు సైనికులు మరణించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో సైన్యంపై దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన జంట దాడుల్లో 10 మంది సైనికులు మరణించారు.
J&K | Three Army personnel lost their lives while three others were injured in a terrorist attack on two military vehicles in the Thanamandi area in Rajouri sector. Indian Army troops also immediately retaliated after being attacked by terrorists. The troops were going to… pic.twitter.com/nlhywjMtn4
— ANI (@ANI) December 21, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!