Czech Republic: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రేగ్ నగరంలోని ఓ యూనివర్సిటీల్లో దుండగుడు సామూహిక కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు మరణించగా.. చాలా మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య, వివరాలను చెక్ పోలీసులు ప్రకటించలేదు.
Read Also: Pallam Raju: రాహుల్ రెండో విడత “భారత్ జోడో యాత్ర”పై సీడబ్ల్యూసీలో భిన్నాభిప్రాయాలు
కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపేశారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లోని భవనాలను ఖాళీ చేస్తున్నారు. అనేక మంది మరణించారని, డజన్ల కొద్దీ గాయపడ్డారని సోషల్ మీడియాలో చెక్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగి డౌన్‌టౌన్ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. చుట్టుపక్కల నివాసాల్లోని ప్రజలు ఇంట్లోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు.
Read Also: Caste Census: కులగణనపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు.. ఓకే, కానీ..
చెక్ అంతర్గత మంత్రి విట్ రకుసన్ మాట్లాడుతూ.. సాయుధులు ఎవరనేది నిర్ధారించలేదని, ప్రజలు పోలీసుల సూచనల్ని పాటించాలని కోరారు. చార్లెస్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ లో కాల్పులు జరిగాయని చెక్ మీడియా పేర్కొంది. పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థులు, టీచర్లు బయటకు రావద్దని కోరారు.