Cold medicines: 4 ఏళ్లలోపు పిల్లలకు పిల్లలకు ఫిక్సుడ్ డ్రగ్ కాంబినేషన్(FDC) జలుబు మందులు వాడటాన్ని కేంద్రం నిషేధించింది. ఈ యాంటీ కోల్డ్ మందుల్లో క్లోర్ఫెనిరమైన్ మెలేట్ మరియు ఫినైల్ఫ్రైన్ అనే రెండు డ్రగ్స్ ఉంటున్నాయి. క్లోర్ఫెనిరమైన్ మలేట్ అనేది యాంటీ-అలెర్జీ (యాంటీహిస్టామైన్) డ్రగ్, ఇది ముక్కు కారడాన్ని, కళ్ల నుంచి నీరు కారడం, తుమ్ముల వంటి అలెర్జీ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఫినైల్ఫ్రైన్ అనేది రక్తనాళాల్లో అవరోధాలను తగ్గించి, ముక్కు మూసుకుపోవడం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Read Also: Jammu Kashmir: పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. ముగ్గురు జవాన్లు మృతి
ఎఫ్డీసీతో తయారైన మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(CDSCO) నిషేధించింది. దీనిపై భారత ఔషధ నియంత్రణ మండలి(DGCI) ప్రకటన విడుదల చేసింది. ఈ సమాచారం వినియోగదారులకు తెలిసేలా లేబుళ్లను ముద్రించాలని ఔషధ సంస్థలను ఆదేశించింది. పిల్లల రోగనిరోధక వ్యవస్థ పెద్దవారితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ ఎఫ్డీసీ మందుల్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పిల్లల్లో దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది.
రెండు లేదా అంతకంటే ఎక్కువ డ్రగ్స్‌ని కలిపి ఒకే ఔషధంగా ఇవ్వడాన్ని ఎఫ్‌డీసీగా అభివర్ణిస్తారు. వీటి వల్ల ప్రజలకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుందని, 14రకాల ఎఫ్‌డీసీలపై ఈ ఏడాది జూన్‌లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిపై నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో 2016లో కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 322 ఎఫ్డీసీ ఔషధాలను నిషేధించింది.