Black Tigers: భారతదేశంలో మొత్తం 10 నల్ల పులులు ఉన్నాయని, అన్నీ కూడా ఒడిశాలోని సిమిలిపాల్ లోనే ఉన్నట్లు ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కి తెలిపింది. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో మాత్రమే ‘‘మెలనిస్టిక్స్ టైగర్స్’’(బ్లాక్ టైగర్స్)ని నమోదు చేశామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభకు తెలిపారు.
Read Also: Sunspot: భూమికి ఎదురుగా సూర్యుడిపై భారీ సన్‌స్పాట్.. భూమి కన్నా రెండింతలు పెద్దది..
పాన్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎక్సర్‌సైజ్ 2022 సైకిల్ ప్రకారం.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో 16 పులులు ఉన్నాయని వీటిలో 10 బ్లాక్ టైగర్ అని చెప్పారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ జనటిక్ కంపోజిషన్ కారణంగా ప్రత్యేకమైన క్లస్టర్‌గా గుర్తించబడుతోందని మంత్రి చెప్పారు. గత 5 ఏళ్లలో ఈ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల సంరక్షణ, నివాసానికి, మానవ వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం పథకం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ వైల్డ్ లైఫ్ హాబిట్స్(CSS-IDWH) కింద రూ. 32.75 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు.