Tamil Nadu Floods: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. వర్షాలు తగ్గినప్పటికీ, ప్రజల్ని కష్టాలు వీడటం లేదు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు గత వారం కురిసిన వర్షాలకు చాలా ప్రభావితమైంది. తూత్తుకూడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.
Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎత్తైన ప్రాంతం నుంచి ఆర్మీ వాహనాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు పాక్ ఆధారిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన పీఏఎఫ్ఎఫ్ పనిగా బాధ్యత ప్రకటించింది. అయితే ఈ దాడి వెనక దాయాది దేశం పాకిస్తాన్‌తో పాటు దాని ఆప్తమిత్ర దేశం చైనా ఉన్నట్లుగా నిఘావర్గాలు తెలుపాయి.
Wrestler Bajrang Punia: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ఎన్నికలు వివాదం కోనసాగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ కావడంపై రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బ్రిజ్ శరణ్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రెజ్లర్లు ఆందోళన చేపట్టారు.
Varun Gandhi: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన నానమ్మ, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో భారత విజయాన్ని ప్రస్తావిస్తూ.. నిజమైన నాయకులు విజయానికి పూర్తి క్రెడిట్ తీసుకోరు అని అన్నారు. 1971 యుద్ధంలో చారిత్రాత్మక విజయం తర్వాత అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్ మానెక్షాకు ఇందిరాగాంధీ రాసిన లేఖను వరుణ్ గాంధీ పంచుకున్నారు.
Windows 10: Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కి ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. దీని ఫలితంగా దాదాపు 24 కోట్ల పర్సనల్ కంప్యూటర్ల (PCలు)పై ప్రభావం పడొచ్చు. ఇది ల్యాండ్ ఫిల్ వ్యర్థాలను పెంచే అవకాశం ఉందని కెనాలిస్ రీసెర్చ్ తెలిపింది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 3,20,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువును కలిగి ఉంటాయని అంచనా. అయితే ఓఎస్ సపోర్టు ముగిసినా కూడా చాలా కంప్యూటర్లు చాలా ఏళ్ల వరకు పనిచేస్తుండగా..
Most wanted: అమెరికాలో నాలుగేళ్ల క్రితం 29 ఏళ్ల భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఆమె కోసం అక్కడి ఏజెన్సీలు వెతుకుతున్నాయి. తాజాగా ఎఫ్‌బీఐ తన మోస్ట్ వాంటెడ్ లిస్టులో భారతీయ మహిళ పేరును చేర్చింది. FBI అధికారులు ఈమె జాడను తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు.
Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ప్రజా వ్యతిరేకత ఉన్న రాష్ట్రాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను బీజేపీకి అప్పగించింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలు మూడింటితో ఓడిపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది.
Rahul Gandhi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘటన జరిగిన సమయంలో బీజేపీ ఎంపీలు త్వరగా తప్పించుకున్నారని అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కొంతమంది యువకులు పార్లమెంట్‌లోకి దూరి పొగ విడుదల చేశారని.. బీజేపీ ఎంపీలు వెనక్కి తగ్గారని అన్నారు. బీజేపీ ఎంపీలు పారిపోయారు, ఉంకీ హవా నికల్ గయీ(వారు గట్టిగా భయపడిపోయారు)" అని రాహుల్ ఎద్దేవా చేశారు.
High Court: భార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తి విడాకుల పిటిషన్‌ని తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ‘‘చర్మం రంగు ఆధారంగా వివక్ష’’ని నిర్మూలించాలని పిలుపునిచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి తన జీవిత భాగస్వామి తనను విడిచిపెట్టిందని వాదించాడు. అయితే డార్క్ కలర్ కారణంగా అవమానించబడి, ఇంటి నుంచి వెళ్లగొట్టబడినట్లు భార్య కోర్టుకు తెలిపింది.
Terrorists Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.