కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ ఉద్దేశిస్తూ ‘‘పిక్‌పాకెట్స్’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం ఆదేశించింది. ఆయన ప్రకటన తప్పుగా ఉందని, 8 వారాల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్‌లతో కూడిన ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
Parliament Breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన నిందితులకు మరో 15 రోజుల పాటు అంటే జనవరి 5 వరకు పోలీస్ కస్టడీ పొడగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు పేర్కొంది. స్పెషల్ జడ్జ్ హర్దీప్ కౌర్ నిందితులు కస్టడీని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ షిండే, నీలం దేవీల కస్టడీని పెంచాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు మరో 15 రోజుల పాటు కస్టడీని పొడగించింది.
New Covid Variant: కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రజల్ని భయపెడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళలోనే 300 కేసులు ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 2669 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే JN.1 వేరియంట్ పెద్దగా ప్రమాదాన్ని కలిగించని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దీనికి వేగం వ్యాప్తించే గుణం ఉందని హెచ్చరించారు.
Mumbai Attack: దేశ వాణిజ్య రాజధాని ముంబైపై మరోసారి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఏకంగా 40 డోన్లను ఉపయోగించి ముంబైపై భారీ ఉగ్రదాడి చేయాలనుకున్న టెర్రరిస్టుల ప్లాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసింది. ముంబైకి ఉత్తరాన 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్ఘా అనే గ్రామాన్ని షెల్టర్‌గా నిందితులు ఉపయోగించుకుంటున్నారు. ఈ కుట్రకు పాల్పడిన ఐఎస్ మాడ్యుల్ కీలక నిందితులు సాకిబ్ నాచన్‌ని అరెస్ట్ చేశారు.
Parliament: పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పరంపరం కొనసాగుతోంది. ఈ రోజు మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్, డీకే సురేష్‌లపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.
Parliament security: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నలుగురు వ్యక్తులు పార్లమెంట్ లోపల, బయట హల్చల్ చేశారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసులపై పార్లమెంట్ ఛాంబర్లోకి ప్రవేశించి పొగ డబ్బాలను పేల్చారు, మరో ఇద్దరు పార్లమెంట్ బయట ఇదే తరహా చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారితో సహా ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Triple Talaq: అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరుడికి కిడ్నీ దానం చేసిన మహిళకు, ఆమె భర్త వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సదరు మహిళ భర్త సౌదీ అరేబియాలతో పనిచేస్తుండగా.. భార్య ఉత్తర్ ప్రదేశ్ లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది. మహిళ సోదరుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటంతో అతడిని రక్షించేందుకు ఆమె తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయమే ఆమె వివాహాన్ని విచ్ఛిన్నం చేసింది.
Election Commissioners Bill: అత్యంత వివాదాస్పద చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల నిమాయకానికి సంబంధించిన(నియామకం, సర్వీస్ రూల్స్, పదవీకాలం) బిల్లు-2023కి గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఈ నెల ప్రారంభంలోనే రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో, పార్లమెంట్ ఆమోదించినట్లైంది. భారత ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివాధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
Bharat NCAP: టాటా మోటార్స్ భారత్‌లో అత్యంత సేఫ్టి రేటింగ్స్ కలిగిన కార్లుగా ఉన్నాయి. టాటా నుంచి వస్తున్న టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్, సఫారీ కార్లు సేఫ్టీ రేటింగ్స్‌లో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. వినియోగదారుడి భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని కార్ల బిల్ట్ క్వాలిటీని స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ఇప్పటికే టాటాకి చెందిన నెక్సాన్, హారియర్, సఫారీ కార్లు గ్లోబల్ NCAP రేటింగ్స్‌లో 5-స్టార్స్ సాధించాయి.
Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. తినడానికి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పుల కోసం విదేశాల చుట్టూ తిరగడమే అక్కడి రాజకీయ నాయకులు, అధికారులకు నిత్యకృత్యమైంది. విద్యుత్, గ్యాస్, పెట్రోల్ ఇలా అన్నింటిపై విపరీతంగా పన్నులు పెంచింది అక్కడి ప్రభుత్వం. ఇదిలా ఉంటే అక్కడి ఆటోమొబైల్స్ పరిశ్రమ కూడా దెబ్బతింది.