Hijab: హిజాబ్ అంశం మరోసారి కర్ణాటకలో వివాదాస్పదం అవుతోంది. గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాలయాల్లో హిజాబ్‌ని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. నిన్న సీఎం సిద్ధరామయ్య మైసూరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..మహిళలు కావాలంటే హిజాబ్ ధరించవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో విద్యాలయాల్లో కూడా హిజాబ్ బ్యాన్ ఎత్తేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్, భారత్‌లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో ఉన్న శాంతి పరిస్థితులు పాకిస్తాన్‌కి నచ్చడం లేదు. కాశ్మీర్లో దాడులు చేసేందుకు పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదుల్ని నియంత్రణ రేఖ దాటించి భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గత రాత్రి నలుగురు ఉగ్రవాదుల్ని, భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా ప్రయత్నించింది.
Shivraj Singh Chouhan: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి గెలుచుకోగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం నిలుపుకుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ మాజీ సీఎంలను కాదని కొత్త ముఖాలను సీఎంలుగా ఎన్నుకుంది.
Air India: టాటా చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలకు విమానాల ఆర్డర్లను ఇచ్చింది. ఇదిలా ఉంటే శనివారం రోజు ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి వైబ్ బాడీ క్యారియర్ ఎయిర్‌బస్ A350-900 అందింది. ఫ్రాన్స్ లోని ఎయిర్‌బస్ ఫెసిలిటీ నుంచి బయలుదేరిన ఈ విమానం ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంది. ఈ తరహా విమానం కలిగిన తొలి భారతీయ ఎయిర్ లైనర్‌గా ఎయిర్ ఇండియా నిలిచింది.
2024 Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఈ నెలలో ఆవిష్కరించబడింది. గతంలోని సోనెట్‌తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా టెక్ లోడెడ్ ఫీచర్ల, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ప్రస్తుతం మార్కె్ట్లో ఉన్న కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జాలతో పోటీపడనుంది.
Vivek Bindra Controversy: ప్రముఖ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన వివేక్ బింద్రా తన భార్యపై గృహహింసకు పాల్పడ్డారు. పేరుకు మాత్రమే మోటివేషనల్ స్పీకర్ కానీ, పెళ్లైన కొన్ని గంటల్లోనే భార్యపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బింద్రా వివాదం చర్చనీయాంశంగా మారింది. బింద్రా భార్య యానికా సోదరుడు వైభవ్ క్వాత్రా నోయిడాలోని సెక్టార్ 126లో అతని బావపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నోయిడాలోని సెక్టార్ 94లోని సూపర్ నోవా వెస్ట్ రెసిడెన్సీలో బింద్రా, యానికా దంపతులు నివసిస్తున్నారు.
BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
COVID-19: మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నాలుగు వారాల్లో కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ(WHO) తెలిపింది. నెల వ్యవధిలోనే 8,50,000 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పింది. 3000 మరణాలు సంభవించినట్లు పేర్కొంది.
Wrestler Virender Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) వివాదం కొనసాగుతోంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సన్నిహితుడు సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కావడాన్ని రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఏస్ రెజ్లర్ సాక్షిమాలిక్ సంజయ్ సింగ్ ఎన్నికపై కన్నీటిపర్యంతమయ్యారు. తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీని ప్రధాని నరేంద్రమోడీకి వాపస్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Heater Incident: రాజస్థాన్ రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గదిలోని హీటర్‌కి మంటలు అంటుకోవడంతో తండ్రి, మూడు నెలల కూతురు సజీవదహనమయ్యారు. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. గదిలోని హీటర్‌తో మంటలు చెలరేగడంతో తండ్రీ, కూతురు మరణించారు. ఈ ఘటనలో అతని భార్యకు గాయాలయ్యాయి.