Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎత్తైన ప్రాంతం నుంచి ఆర్మీ వాహనాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు పాక్ ఆధారిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన పీఏఎఫ్ఎఫ్ పనిగా బాధ్యత ప్రకటించింది. అయితే ఈ దాడి వెనక దాయాది దేశం పాకిస్తాన్‌తో పాటు దాని ఆప్తమిత్ర దేశం చైనా ఉన్నట్లుగా నిఘావర్గాలు తెలుపాయి.
జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించడానికి పాకిస్తాన్, చైనా సహకరిస్తున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. లడఖ్ సరిహద్దు నుంచి కాశ్మీర్ వైపు సైన్యాన్ని మరల్చాలనే వ్యూహంతోనే, భారత సైన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు తేలింది.
ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు పెరిగాయి. పూంచ్, రాజౌరీ సెక్టార్లలో భారత బలగాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్, బీజింగ్ పరస్పర సహాకారంతోనే భారత్‌పై ఉగ్రవాదుల్ని ఎగదోస్తోంది. భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు పాకిస్తాన్ 25-30 మంది ఉగ్రవాదుల్ని పూంచ్ అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశపెట్టిందని నిఘా వర్గాలు తెలిపాయి.
Read Also: Pallavi Prashanth: బిగ్ బ్రేకింగ్..పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు..
2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనా మధ్య స్టాండ్ ఆఫ్ ఏర్పడింది. దీంతో భారత సైనికులు, చైనా సైనికులకు అడ్డుకోవడాన్ని చూసి డ్రాగన్ దేశం విసుగు చెందుతోంది. దీంతోనే ఆ ప్రాంతంలోని భారత సైన్యాన్ని కాశ్మీర్ వైపు దృష్టి సారించేందుకు పాక్, చైనాలు కలిసి పనిచేస్తున్నాయి.
పూంచ్-రాజౌరీలో పెరుగుతున్న ఉగ్రవాద దాడులు, అటవీ ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని తరిమి కొట్టేందుకు సైన్యం ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇటీవల ఆపరేషన్లలో పాకిస్తాన్‌కి చెందిన 20 మందికి పైగా ఉగ్రవాదుల్ని భారత సైన్యం అంతమొందించింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు పాకిస్తాన్, చైనాలకు ఆందోళన పెంచుతోంది, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 370కి మద్దతు తెలపడంతో పాక్-చైనాలకు చెంపదెబ్బగా మారిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.