Microsoft Windows 10: విండోస్ 10కి స్వస్తి పలకనున్న మైక్రోసాఫ్ట్.. 24 కోట్ల కంప్యూటర్లపై ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Windows 10: Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కి ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. దీని ఫలితంగా దాదాపు 24 కోట్ల పర్సనల్ కంప్యూటర్‌ల (PCలు)పై ప్రభావం పడొచ్చు. ఇది ల్యాండ్ ఫిల్ వ్యర్థాలను పెంచే అవకాశం ఉందని కెనాలిస్ రీసెర్చ్ తెలిపింది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 3,20,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువును కలిగి ఉంటాయని అంచనా. అయితే ఓఎస్ సపోర్టు ముగిసినా కూడా చాలా కంప్యూటర్లు చాలా ఏళ్ల వరకు పనిచేస్తుండగా.. సెక్యూరిటీ అప్డేట్ లేని పరికరాల డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కెనాలిస్ హెచ్చరించింది. అయితే విండోస్ 10 పరికరాల కోసం అక్టోబర్ 2028 వరకు వార్షిక ధరకు సెక్యూరిటీ అప్డేట్స్ అందించే ప్రణాళికను ప్రకటించింది. అయితే ఈ ధర ఎంత ఉంటుందనే వివరాలను వెల్లడించలేదు.
Read Also: Ivanka Trump: ఇజ్రాయిల్‌లో ట్రంప్ కూతురు.. అక్టోబర్ 7 బాధితులకు పరామర్శ..
Also Read
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
ఒకవేళ విండోస్ 10 సపోర్ట్ సెక్యురిటీ అప్డేట్స్ కోసం ధరను ప్రతిపాదిస్తే.. గతంలో లాగే, కొత్త పీసీలకు మారడం ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుంది, స్ర్కాప్‌గా మారే పాత పీసీల సంఖ్యను పెంచుతుందని కెనాలిస్ అంచానా వేస్తోంది. అక్టోబర్ 2025 నాటికి Windows 10 సపోర్ట్ నిలిపేయాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. కంప్యూటర్లకు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను జోడించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ తీసుకురావడం వల్ల, మందగించిన పీసీ మార్కెట్‌ని సమర్థవంతంగా పెంచగలదు.
కంప్యూటర్లు, డేటా స్టోరేజ్ సర్వర్లలో ఉపయోగించే హార్డ్ డ్రైవ్‌లు ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో ఉపయోగించేందుకు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం రీసైకిల్ చేయబడుతాయి. పనిచేయకుండా పోయిన కంప్యూటర్లు, అయస్కాంతాలుగా మారుతాయని, ఇవి ఎలక్ట్రిక్ మోటార్లలో, విండ్ టర్బైన్లలో వాడుతారని నోవెన్ మాగ్నెటిక్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పీటర్ అఫియునీ అన్నారు.
తాజావార్తలు
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?