High Court: భార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తి విడాకుల పిటిషన్‌ని తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ‘‘చర్మం రంగు ఆధారంగా వివక్ష’’ని నిర్మూలించాలని పిలుపునిచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి తన జీవిత భాగస్వామి తనను విడిచిపెట్టిందని వాదించాడు. అయితే డార్క్ కలర్ కారణంగా అవమానించబడి, ఇంటి నుంచి వెళ్లగొట్టబడినట్లు భార్య కోర్టుకు తెలిపింది.
2005లో వివాహం చేసుకున్న సదరు వ్యక్తిపై కోర్టు కఠినంగా స్పందించింది. ఈ కేసులో తమ తీర్పు ద్వారా ఇతరులు కూడా రంగు ఆధారంగా మనస్తత్వాన్ని ప్రోత్సహించలేమని స్పష్టం చేసింది. మానవజాతి మారాల్సిన అవసరం ఉందని, చర్మం రంగు ప్రాధాన్యతను ప్రోత్సహించకూడదని జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Read Also: Poonch attack: జవాన్లపై యూఎస్ రైఫిళ్లతో ఉగ్రవాదుల దాడి.. లష్కర్‌కి చెందిన ఉగ్రసంస్థ పని..
వైవాహిక భాగస్వాముల ఎంపికలో చర్మం రంగు పోషించే పాత్రపై అధ్యయనాలను, ఫేయిర్ నెస్ క్రీములపై కోర్టు సుదీర్ఘ చర్చలను, 2020 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ సవరణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. ఫెయిర్ స్కిన్‌ను ప్రమోట్ చేసే ప్రకటనలకు ఐదేళ్లు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పింది.
ముదురు రంగు చర్మం గల(మహిళలు) వారిని తక్కువగా చూపించడం, చర్మాన్ని కాంతివంతం చేసే సౌందర్య సాధనాలలో ఎక్కువ భాగం మహిళలను లక్ష్యంగా చేసుకుంటాయి. వారు తక్కువ రంగు చర్మం కలిగిన స్త్రీని తక్కువగా, తక్కువ కాన్ఫిడెంట్‌గా చూపించే ప్రయత్నం చేయడంతో పాటు జీవితంలో సక్సెస్ అవ్వలేరని చూపించే వారని అధ్యయనాలు సూచించాయని కోర్టు పేర్కొంది. కాబట్టి నల్లటి రంగు కంటే ఫెయిర్ స్కిన్‌కి ప్రాధాన్యత ఇవ్వడం అనే సమాజం యెక్క మైండ్ సెట్ మారాలని కోర్టు చెప్పింది. ఈ కేసులో భర్త విడాకులను ఆమోదించలేమని కోర్టు చెప్పింది. ఇది క్రూరత్వానికి కారణం కాదని తాము భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది.