Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్‌ని జనవరి 3న తమ ముందు హాజరుకావాలని కోరింది.
ఇప్పటికే రెండు సార్లు ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ హాజరుకాలేదు. తాజాగా మూడోసారి ఈడీ సమన్లు పంపింది. డిసెంబర్ 18న కేంద్ర ఏజెన్సీ సమన్లు జారీ చేసింది, డిసెంబర్ 21న హాజరు కావాలని కేజ్రీవాల్‌ను కోరింది. అయితే కేజ్రీవాల్ వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. 10 రోజలు విపాసన ధ్యాన శిబిరానికి వెళ్లారు.
Read Also: JN.1 Corona variant: దేశంలో 21 కొత్త వేరియంట్ కేసులు.. కేసులన్నీ రెండు రాష్ట్రాల్లోనే నమోదు..
ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ కీలక నేతలు జైలులో ఉన్నారు. మాజీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాతో పాటు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ వేధింపులుగా అభివర్ణిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఐటీ, సీబీఐల ద్వారా రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు.